కియారా అద్వానీ పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. ఇటు బాలీవుడ్‌తో పాటు… ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికి కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ బ్యూటీ. మహేష్ బాబుతో భరత్ అనే నేనులో నటించి తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాని వెంటనే రామ్ చరణ్‌తో వినయవిధేయరామ సినిమాతో తెలుగులో తొలి పరాజయాన్ని కూడా మూటగట్టుకుంది ఈ భామ. ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో..హిందీలోనే సినిమాలు చేస్తు బీజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అందచందాలతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది.
గత కొన్నాళ్లుగా కియారా అద్వానీ ఓ బాలీవుడ్ హీరోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరు రిలేషన్‌షిప్ గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిని నిజం చేస్తూ తాజాగా ఈ జంట మీడియా కంటపడింది. ఇక రీసెంట్ గా మరోసారి ఇద్దరు కూడా ఒక పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ప్రత్యేకంగా కలిసి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఘటనతో వీరి రిలేషన్ గురించి క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ షోలో సిద్దార్థ్ మల్హోత్రాతో తనకున్న బంధాన్ని గురించి వివరించే ప్రయత్నం కియారా చేసింది.
తన బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా గురించి పెదవి విప్పింది. సిద్దార్థ్ మల్హోత్ర తనకు మంచి ఫ్రెండ్.. అంతకంటే ఎక్కువే అని చెప్పుకొచ్చింది.షేర్షా సినిమాతో సిద్దార్థ్, కియారా మధ్య బంధం బలపడిందని చెప్పుకొచ్చింది కియారా. దీంతో కియారా అద్వానీ సిద్దార్థ్‌తో ఎఫైర్‌లో ఉందని అందరికి అర్థం అయిపోయింది. వీరిద్దరు కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇక కియారా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు… బాలీవుడ్‌లో మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తుంది ఆ భామ. మరి పెళ్లి తరువాత కియారా సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాల్సి ఉంది.