Tuesday, October 8, 2024

Chandrababu: లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు?.. చంద్రబాబు విఫలయత్నం

- Advertisement -

Chandrababu: తిరుమల వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం వివాదం మరింత ముదురుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని అర్థం లేని ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డట్లు అయింది. రాజకీయ లబ్ది కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీపై దుష్ఫ్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిని వాడుకుంటారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి చంద్రబాబు విఫల యత్నం చేశారని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) ఇచ్చిన నివేదిక తెలియజేస్తుంది.

2024, జూలై 12న ఆవు నెయ్యిని టీటీడీ పరీక్షల కోసం పంపించగా.. జూలై 23న నివేదిక ఇచ్చినట్లు ఎన్‌డీడీబీ తెలిపినట్లు స్పష్టంగా ఉంది. ఒక ఆవు నెయ్యి ట్యాంకర్‌లో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌లు కల్తీ అయినట్లు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని జూలై 23న టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అంతేగానీ, జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని టీడీపీ అధికార వర్గాలతో పాటు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెబుతున్నారు. ఇదంతా గమనిస్తుంటే.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వాడారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తూనే ఉంది. ఇదంతా ఇలా ఉంటే.. జూన్‌ 14న టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును నియమించింది చంద్రబాబు ప్రభుత్వమే అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!