YS Jagan: మొత్తానికి బాలినేని వ్యవహరం వైసీపీలో ముగిసిందనే చెప్పాలి. ఆయన చేసిన పనులు, మాట్లాడిన మాటలు జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. సీనియర్ నేతగా, కుటుంబ సభ్యుడుగా ఎంతో గౌరవం ఇచ్చినప్పటికి బాలినేని వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరంగా ఉందనే చెప్పాలి. అసలు బాలినేని రాజకీయ జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే..
బాలినేని తొలి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడుగా ఉన్నారు. జగన్‌కు బంధువు అయిన బాలినేని వైసీపీ ఆవిర్భావం నుంచి తోడుగా నిలిచారు. బాలినేని నాలుగు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు. జగన్ తొలి మంత్రివర్గంలోనే ఆయనకు స్థానం కల్పించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో జగన్ నాడు బాలినేనిని తప్పించి సురేష్ ను కొనసాగించారు. ఆ సమయంలోనే బాలినేని ఆగ్రహంతో దూరమయ్యారు. అప్పటి నుంచే బాలినేని వ్యవహరం జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
తాజా ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి ఓడిపోయారు. ఓడిన తరువాత ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగారు. తనకు ఈ పోరాటంలో పార్టీ నుంచి సహకారం లేదని ఆరోపించారు. ఇద అంశం పైన జగన్ ను కలిశారు. ఆ సమయంలో జగన్ మరోసారి బాలినేనిని బుజ్జగించారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని బాలినేనికి జగన్ సూచించారు. అయితే వాటిని బాలినేని తిరస్కరించారు. తన ఆర్దిక పరిస్థితిని వివరించారు. తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. బాలినేనితో వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ రాయబారం నడిపారు.
కానీ,బాలినేని మెత్తబడలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్‌కు లేఖ రాశారు. ఇక్కడ వరకు బాగనే ఉన్నప్పటికి బాలినేనికి అర్థం కాని విషయం ఏమిటంటే ..జగన్‌ను విడిచి వెళ్లిన రాజకీయ నాయకులు ఎవరూ కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఒకరిద్దరు తప్పిస్తే మిగిలిని నాయకులు ఎవరూ కూడా రాజకీయంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఒంగొలులో వైసీపీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఓడిపోవచ్చు. భవిష్యత్తులో అక్కడ విజయం వైసీపీదే. అది తెలిసి కూడా బాలినేని పార్టీని వీడటం నిజంగా బాధకారం. పోని బాలినేనికి సొంతంగా బలం ఉందా అంటే ఆయన 2014 ,2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ఆయన గెలిపించి పార్టీ గాలిలోనే తప్పిస్తే సొంతంగా కాదని అర్థం అవుతోంది. ఏది ఏమైనప్పటికి బాలినేని వైసీపీని తన రాజకీయ సమాధిని తానే తవ్వుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.