Chandrababu:మూడు నెలలోనే చంద్రబాబుపై అసంతృప్తి పెరిగిపోయిందా అంటే అవననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సంక్షేమంలోనూ, పరిపాలనలోనూ రెండిటిలోనై చంద్రబాబు సర్కార్ దారుణంగా ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.
2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. అయితే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి రెండు నెలలలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. జూన్ 4న చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. అంటే కూటమి ప్రభుత్వం మూడు నెలల పాలనను పూర్తి చేసుకుంది. ఈ మూడు నెలల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘెరంగా ఫెయిల్ అయ్యారు.
ఉచిత బస్సు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సీలిండర్లు వంటివి అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకుంటుంది. పైగా సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుందని చంద్రబాబే స్వయంగా చెప్పడంతో ఈ పథకాలు అమలు చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ప్రజల్లో మూడంటే మూడు నెలల్లో చంద్రబాబుపై తీవ్ర తిరేకత వ్యక్తం అవుతోందని తాజాగా ఓ సర్వేలో తేలింది.ఈ మూడు నెలల కాలంలోనే చంద్రబాబుకు ప్రజల్లో 10 శాతం మద్దతు తగ్గినట్టు ఇండియా టూడే సర్వేలో తేలింది.
ఎన్నికల సమయంలో చంద్రబాబుకు 55 శాతం ప్రజల మద్దతు ఉండగా, ఆగస్టు 23 నాటికి ఆ మద్దతు 44 శాతానికి చేరిందని ఇండియా టూడే తేలిపింది. హామీల అమలు జాప్యం వల్లే ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500 వంటి పథకాలు అమలు కాకపోవడం వల్లే ఈ విధంగా చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని తెలుస్తోంది.మరో వైపు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో కూడా చంద్రబాబు సర్కార్ దారుణంగా ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు 10 శాతానికి పైగా ప్రజల మద్దతు కోల్పోయినట్టు తెలుస్తోంది.