YS Jagan: గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు.. ప్రజల గుండెల్లో అభిమానం ఇంకా పదిలపరుచుకున్నామా అనేదే అసలు ప్రధానం. ఎన్నికల సమయాల్లో ఒక పార్టీ ఓడిపోయిందంటే చాలా కారణాలు ఉండొచ్చు. పరిస్థితులు అప్పటికప్పుడు తారుమారు అయి ఉండొచ్చు.. ఈవీఎంల పనితీరుపై ఆధారపడి ఉండొచ్చు.. అమలు కాని హామీలను నమ్మి ప్రజలు గుడ్డిగా ఓట్లు వేసి ఉండొచ్చు.. ఇలా ఏమైనా జరగొచ్చు అనే దానికి ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలే సాక్ష్యం. అధికారంలో ఉండి కూడా ప్రభుత్వం మన చేతుల్లోనే ఉంది కదా అని విర్రవీగకుండా ఇచ్చిన హామీలకు మించి ఇవ్వనివి కూడా నెరవేర్చి ప్రజల కళ్లల్లో ఆనందం చూడడం ఒక్క వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికే సాధ్యపడింది. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా రాష్ట్రానికి ఒక మార్గదర్శిగా తనదైన నిర్ణయాలతో ముందుకు నడిపించిన జగన్.. ప్రస్తుతం ఏపీలో వచ్చిన వరద విపత్తు సమయంలో కూడా సీఎంగా అధికారంలో ఉంటే ఎంతో బాగుండేదనే మాటలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండడమే కాదు.. ఎంత నిజాయితీగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డామనేదే ముఖ్యం. ఇది 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనబడిన పరిస్థితి.
సంక్షేమ పథకాలు, సుపరిపాలన, విద్యావ్యవస్థ ప్రక్షాళన, సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ రైతు భరోసా, వలంటీర్ వ్యవస్థ.. ఇలా ఎన్నో మరెన్నో కార్యాచరణలతో రాష్ట్రాన్ని ఒంటిచేత్తో నడిపించిన జగన్ ఓడిపోలేదు.. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ అధికారంలోకి వస్తారు, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం తప్పదు అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇదంతా ఇలా ఉండగా.. మొన్నటికి మొన్న వైఎస్ జగన్ పాలనపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు దక్కడం కూడా మనం చూశాం. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సులో పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి జగన్ చేపట్టిన మంచి పనులకు గౌరవం లభించడం గర్వించదగిన విషయం. పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించి నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన జగన్ నిర్ణయాలకు ఇటీవలే మరో గౌరవం కూడా దక్కింది. ఈవోడీబీ–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమలులో ఏపీ రెండో స్థానంలో నిలవడంతో పాటు పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఏపీ పనితీరు భేష్ అని స్వయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మెచ్చుకోవడం జగన్ పనితీరుకు అద్దం పడుతుంది. అధికారంలో లేకపోయినప్పటికీ గత పాలనలోని కార్యక్రమాలకు ఇప్పటికీ ఆదరణ లభించడం చూస్తే జగన్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో రెట్టింపు ప్రభంజనం సృష్టిస్తారని స్పష్టమవుతోంది.