Tuesday, October 8, 2024

Jhony master: దారుణం గా దొరికేసిన జానీ మాస్టర్ – FIR లో నమ్మలేని నిజాలు , జనసేన కి చావు దెబ్బ

- Advertisement -

Jhony master: టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు ప్రస్తుతం 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో పోలీసులు కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు. ఘటన జరిగినప్పుడు యువతీ మైనర్ కాబట్టి POCSO చట్టం కూడా వర్తించే అవకాశం ఉంది.

ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్ అత్యవసర సమావేశం జరగనుంది. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సభ్యత్వం రద్దు చేస్తే ఆయన తన అధ్యక్ష పదవిని కోల్పోతారు.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ షేక్ జానీ బాషాపై చర్యలు తీసుకుంది. కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్ ఆ పార్టీ తరపున ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓ దశలో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక స్థానంలో ఆయన పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. FIR లో నమ్మలేని నిజాలు ఉండటం మరియు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత షేక్ జానీ బాషాపై ఉన్నప్పటికీ తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కేవల౦ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని జనసేన అనడ౦తో ఆ పార్టీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి కుడి భుజంలా వ్యవహరించిన జానీ మాస్టర్ ఇంత దారుణంగా దొరికేయడం ఇది జనసేన పార్టీకి చావు దెబ్బ లాంటిదని ప్రజలు అనుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!