వాయిస్:
Chandrababu:వరదలకు కారణమైన బాబు నిర్లక్ష్యంపై ఆగ్రహజ్వాలలు వెలువెత్తుతూనే ఉన్నాయి. బుడమేరు శాపం కచ్చితంగా బాబుకు తుగులుతుందని ఘోసను ప్రదర్శిస్తున్నారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఏ మాత్రం తగ్గలేదని, రోజూ మందీ మార్బలంతో పర్యటన చేస్తున్నారు కానీ బాధితులను పట్టించుకోవడం లేదని విపక్షనేతలు, రాజకీయ ప్రముఖులు స్పష్టం చేశారు. అంతే కాకుండా అందరితో పొగిడించుకుంటూ ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నారని ఆక్షేపించారు. బుడమేరు నీటి వల్లనే విజయవాడ మునిగిందన్న బాబు, ఆ బుడమేరుకు కచ్చితంగా చంద్రబాబే శాపమని, BDC ఆధునికీకరణ పనులను ఆయన పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.
బైట్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నేతల బైట్లు
వాయిస్:
గత నెల 28న వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హెచ్చరిక చేసినా కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, విపత్తుపై కనీసం సమీక్ష జరపలేదని మండిపడ్డారు. 30వ తేదీ నాటికే రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఆ మర్నాడు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తి, చంద్రబాబు అక్రమ నివాసం నీట మునిగిందని గుర్తు చేస్తున్నారు. దీంతో కలెక్టరేట్‌కు మకాం మార్చిన చంద్రబాబు, విజయవాడ లోతట్టు ప్రాంతాల వారిని అస్సలు పట్టించుకోలేదని అన్నారు. కనీసం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చర్యలు కూడా చేపట్టలేదు, ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఫ్లడ్ వాటర్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని విపక్ష నేతలు ప్రశ్నించారు.
వాయిస్
ఇకపోతే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుడమేరుపై ఉన్న వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తువేస్తున్నట్లు సమాచారమే లేదని దూయ్యబట్టారు. ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు. రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి నగరంలోని లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు ఎందుకు తరలించలేదని నిలదీశారు. ఇప్పుడు జరిగిన మరణాలకు, లక్షల మందికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు.
వాయిస్
చంద్రబబు వ్యవహారశైలి దారుణంగా ఉందని పలువురు రాజకీయ ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. నాటి గోదావరి పుష్కరాల ఘటన గుర్తు చేసుకున్నారు. విజయవాడను వరద ముంచెత్తి దాదాపు వారం కావొస్తున్నా, పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడా కుదుట పడలేదని, బాధితులకు నరకం తప్పడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో స్పష్టత లేదని వాస్తవ సంఖ్య తక్కువగా చెప్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు బుడమేరుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న బాబు 2014-19 హయాంలో (బీడీసీ) ఆధునికీకరణ ఎందుకు చేపట్టలేదని గట్టిగా నిలదీశారు. బీడీసీపై ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది కాదా? అని సూటిగా ప్రశ్నించిన వైసీపీ, విపక్ష నేతలు, కేవలం ఆయన కోసమే, బీడీసీ ఆధునికికరణను గాలికొదిలేశారని ఆక్షేపించారు.
ఎండ్ వాయిస్
ఇప్పటికైనా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పక్కన పెట్టి, విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని, చేసిన తప్పిదాలకు ప్రజలను క్షమాపణ కోరాలని టీజేఆర్ సుధాకర్‌బాబుతో పాటు పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అంత మంది మరణానికి, ఇన్ని లక్షల మంది బాధలకు కారణమైన చంద్రబాబు, తాను సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, అసలు కూటమి ప్రభుత్వంతో సీఎం ఎవరన్నది తెలియని పరస్థితి ఉందని అన్నారు. ప్రత్యక్ష సీఎం, పరోక్ష సీఎం లు కలిసి ప్రజలను ఇబ్బదులు పెట్టడం ఆపి భరోసా కల్పించాల్సినవసరం ఉందని తెలియజేశారు
—————— హరీష్ ————————–