Tuesday, January 14, 2025

YSRCP- TDP : బాబు విమర్శలన్నీ వైసీపీ పైనే రెచ్చిపోయిన సుబ్బారెడ్డి

- Advertisement -


YSRCP- TDP : రాష్ట్రంలో వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిపోయింది. నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పకుండా బాబు, కూటమి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సాయం లేదు, బాధితులకు భరోసా లేదు, పరిష్కారం లేదు. మోసపోయిన ప్రజల ఇబ్బందులు చేస్తూంటే బాధ కలుగుతోందని వైసీపీ సుబ్బారెడ్డి వాపోయారు. అసలు బాబు అంటేనే బ్రష్టు పాలనకు బ్రాండ్ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే తనది, చెడు జరిగితే వైసీపీ మీదకి నెట్టేస్తున్నారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మాత్రం అపడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏమాత్రం కనికరం లేకుండా బాబు, కూటమినేతలు వ్యవహరిస్తున్నారు. వదరల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై, అన్యాయంపై ఎవరైనా మాట్లాడితే వారిపై దాడికి దిగుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారనే భయం కూడా కూటమి నేతల్లో కనిపించడం లేదు. ఎవరికి వారే నిర్ణాయాలు తీసుకుంటూ సమన్వయ లోపంతో కూటమి నేతలే కొట్లాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అక్రమ నిర్మాణానాన్ని కాపాడుకునేందుకే బుడమనేరు గేట్లు ఎత్తి ప్రజల ప్రాణాలు తీశారని చెప్పారు. రాష్ట్రంలో గత 4 నెలల నుంచి కక్ష సాధింపులే కానీ సంక్షమాన్ని సాధించాలనే తపన లేదు. రెడ్ బుక్ రాజ్యంగమంటూ వైసీపీ నేతలనే టార్గెట్ గా వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైఫల్యాలపై నిలదీస్తే చాలు.. రెండోరోజే నోటీసులు వస్తున్నాయి. భయందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. అధికారం కోసం గతంలో పవన్ కల్యాణ్ కూడా అడ్డమైన పనులు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అలా చేయడం లేదు.. నిజమైన రాజ్యాంగాన్ని, హామీలకు కట్టుబడి పనిచేస్తున్నారు. అన్యాయం కనబడుతుంది కాబట్టే ఫైట్ చేస్తున్నారని అన్నారు. అరెస్టులతో భయపెట్టినంత మాత్రాన ఇబ్బందులు తొలిగిపోవు, ప్రశ్నిస్తామన్న పవన్ పవర్ లోకి వచ్చాక ఎలా మారిపోయారో ప్రజలు చూస్తున్నారని తెలియజేశారు. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలే తిరబడే రోజులు వస్తాయని, వైసీపీ కార్యకర్తలు, నేతల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసి పరిష్కరించుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
————– హరీష్ ———————————–

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!