Friday, October 4, 2024

HYDERABAD: మందుబాబులకు షాక్..భాగ్యనగరంలో మందు షాపులు బంద్

- Advertisement -

HYDERABAD:వినాయక చవితి వేడుకల్లో భాగ్యనగరం రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్. వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇక్కడ ప్రతిదీ హైలెట్. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ..ఖమ్మం నుంచి కరీంనగర్ వరకూ ఇలా రెండు రాష్ట్రాల ప్రజలు వినాయక విగ్రహాలను చూసేందుకు పోటెత్తుతారు. భాగ్యనగరంలో ఎటుచూసినా జనమే. ముఖ్యంగా నిమజ్జనోత్సవాలను చూసి తరించేందుకు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద సందడే సందడి. అయితే పెరుగుతున్న జన తాకిడి ద్రుష్ట్యా హైదరాబాద్ పోలీస్ విభాగం ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల పాటు భాగ్యనగరంలో మందు కొట్లకు సెలవు ప్రకటించింది పోలీస్ శాఖ.

అయితే వినాయక నిమజ్జన వేడుకలు అంటేనే అదొక సందడి. అందులో మద్యందే ముఖ్యపాత్ర. కానీ ఆ మద్యాన్ని నియంత్రించింది పోలీస్ శాఖ. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బార్లు, వైన్ షాపులు బంద్ కానున్నాయి. నగరంలో వినాయక నిమజ్జనం వేళ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున జరిగే ఈ నిమజ్జనం కోసం పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా బడా గణేష్ విగ్రహం ప్రాంతం నుంచి నిమజ్జనం పెద్ద ఎత్తున జరిగే నక్లెస్ రోడ్ వరకు పూర్తి నిఘా ఏర్పాటు చేసారు. నగరంలో నిమజ్జనం నాడు ట్రాఫిక్ మళ్లింపు పైన ఇప్పటికే ప్రకటన చేసారు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఖైరతాబాద్ మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నగరంలో గణేష్ నిమజ్జనం కు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత కారణంగా పోలీసులు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలోని బడా గణేషుడైన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. నిమజ్జనం 18వ తేదీ సైతం కొనసాగే అవకాశం ఉంది. దీంతో, సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సెప్టెంబర్ 17వ తేదీకి తొమ్మిది రోజులు అవుతుండటంతో సుమారు అన్ని వినాయకులను అదే రోజున నిమజ్జనం చేయనున్నారు. కొన్ని గణేషులను పదకొండు రోజుల వరకు ఉంచినప్పటికీ చాలా వరకు తొమ్మిదో రోజునే నిమజ్జనం చేస్తుంటారు. దీంతో ఆ రోజున నగరమంతా పండగ వాతావరణం నెలకొననుంది. ఈ క్రమంలో నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

శోభాయాత్రలు జరిగే మార్గాల్లో నిమజ్జనాలు చేసే ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కొత్తగా వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. రంగంలోకి దిగి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో.. నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం రోజయిన సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!