Friday, October 4, 2024

YS Jagan:జగన్ చెప్పిందే జరిగింది — ఢిల్లీ నడిబొడ్డు లో బయటపడిన EVMల గోల్ మాల్ !

- Advertisement -

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత ఈవీఎంలపై బాలినేని పోరాడుతున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాడ్లకు చెందిన లెక్కలు తేలాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలు, వీవీప్యాడ్లు లెక్కించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్‌ ఆయా ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌ చేపడుతుందని చెప్పడంతో వీవీప్యాడ్లు, ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాలని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను ఒంటరిగా ఇంతగా పోరాడుతుంటే పార్టీ నుంచి తనకు సరైన సపోర్ట్‌ రావటంలేదని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల కింద వైసీపీ అధినేత జగన్‌ను కూడా కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో బాలినేని పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం చర్యని వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది.

వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీప్యాడ్లు తనిఖీ మరియు పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ-ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ముందుగానే చెప్పినట్లు ఈవీఎంల గోల్ మాల్ త్వరలో బయటపడనుందని కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!