Saturday, October 5, 2024

YCP-TDP: టీడీపీ కూటమి ట్రాప్‌లో వైసీపీ.. నిజాలు తేలేనా?

- Advertisement -

YCP-TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టామన్న ఒకే ఒక్క కారణంగా ప్రతిపక్షాన్ని టీడీపీ కూటమి ఇష్టారీతిన ఆడిస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నది టీడీపీ కూటమి ఆరోపణ. అంటే రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాతే. మరి ఈ వివాదానికి అసలు వైఎస్సార్సీపీకి ఏంటి సంబంధం అనేది ఇక్కడ అసలు ప్రశ్న. కల్తీ నెయ్యి విషయంలో టీడీపీ చూపించిన అత్యుత్సాహాకి వైసీపీ ట్రాప్‌లోకి వెళ్లిందనేది అర్థమవుతూనే ఉంది. నిజానిజాలు తేల్చకుండా కాలయాపన చేస్తూ ప్రతిపక్షం వైసీపీని ప్రజలలో దిగజార్చే ప్రయత్నం చేయడం టీడీపీ కూటమికే చెల్లింది. గతంలో టీటీడీ చైర్మన్లుగా, ఈవోలుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుని ఎక్కడ తాము చేసిన దుష్ప్రచారాలు బట్టబయలు అవుతాయో అని విషయాన్ని చాలా తేలిగ్గా పక్కనపెట్టి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలా వ్యవహరిస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం.

కానీ, వివాదంపై ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రియాక్ట్ కావడంతో ఏమీ చేయలేని స్థితిలో టీడీపీ మౌనం వహించింది. టీడీపీ కూటమి ట్రాప్‌లో వైసీపీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా పడిపోయారనేది వాస్తవ పరిస్థితి. టీడీపీ కూటమి హయాంలో కల్తీ జరిగిందన్నది ఎంత నిజమో కాదో తెలియదు కానీ, సిట్ దర్యాప్తు వేశాక నిజానిజాలు తేలితే వైసీపీ సీరియస్‌గా స్పందించినా బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే అలా వైసీపీ టీడీపీ ట్రాప్‌లో చిక్కుకుందని చర్చలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కల్తీ జరగలేదని తేలితే ఆ క్రెడిట్ మొత్తం ప్రభుత్వానికే వస్తుంది. గతంలో జరిగిందన్న దాని మీద టీడీపీ కూటమి పెద్దలు ప్రజల్లో అనుమానపు బీజాలను ఎలాగో నాటారు. మరి దీని మీద ఏ రకమైన విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ నిజాలు బయటకు వచ్చినా అధికార టీడీపీ ఆ విషయం ప్రజల వరకు చేరకుండా కొత్త ఎత్తుగడలు వేస్తుందేమోనని వైసీపీ భావిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!