Sunday, June 29, 2025

ఆర్‌.నారాయ‌ణ మూర్తి హిట్స్ అండ్ ఫ్లాప్స్‌

- Advertisement -

సామాజిక అంశాలే ప్రధాన కథలుగా ఎంపిక చేసుకొని సినిమాలు తీసే న‌టుడు, ద‌ర్శ‌కుడు ఆర్.నారాయ‌ణ మూర్తి. ఆర్‌. నారాయ‌ణ మూర్తి త‌న కెరీర్ మొత్తం ప్రజా స‌మ‌స్య‌లే ల‌క్ష్యంగా మూవీస్‌ను నిర్మించారు. మూర్తి గారు సుమారు మూడు డ‌జ‌న్ల వ‌ర‌కు సినిమాలు తీశారు. వీటిలో ఎక్కువ‌గా సామాజిక ఉద్యమాలు, రైతుల సమస్యలు, శ్రామికుల బాధాక‌ర ప‌రిస్థితుల‌నే హైలైట్‌ చేశారు. ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, దళం వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గరే కాక ప్రజా గుండెల్లో నిలిచిపోయాయి. ఇక‌ అర్ధరాత్రి స్వతంత్రం, చీమల దండు, లాల్ సలామ్ వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఎర్ర సైన్యం మూవీ అయితే ఆయ‌న కెరీర్‌లో చిర‌స్థాయి బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆలోచించండి, భూ పోరాటం,హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.

సినిమాల విజయాలు కంటే సామాజిక సందేశాల గాఢతకు పెద్దపీట వేయడం నారాయ‌ణ మూర్తి గారి ప్ర‌త్యేక‌త‌. 36 సినిమాల్లో సుమారుగా 10 చిత్రాలు సూపర్ హిట్‌/బ్లాక్ బాస్టర్ కాగా..దాదాపు 20కు పైగా సినిమాలు అవరేజ్ స్థాయిలో నిలిచాయి. ఈ లెక్కన చూస్తే కమర్షియల్ లాభాలు కాక…కలుషిత రాజకీయాలపై విమర్శ, పల్లె ప్రజల ఆత్మగౌరవం, ఉద్యమాల ప్రతిధ్వనికి మూర్తి గారు ఎక్కువ ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. వీర తెలంగాణ, పోరు తెలంగాణ, చలో అసెంబ్లీ, పీపుల్స్ వార్ వంటి చిత్రాలు ప్రాంతీయ ఉద్యమాల మాదిరిగా నిలిచాయి. ఈ ప్రయాణంలో నారాయణ మూర్తి సినిమాలు చట్టసభల కన్నా ప్రజల మనసుల్లో ప్ర‌ముఖ‌మైన స్థానాన్ని సంపాదించుకోగ‌ల్గారు.

మూర్తి గారి ఆల్ మూవీస్ లిస్ట్‌

1.అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం…సూప‌ర్ హిట్ 2. ఆలోచించండి..ఫ్లాప్ 3. భూ పోరాటం..ఫ్లాప్ 4. అడ‌వి దివిటీలు..సూప‌ర్ హిట్ 5.స్వ‌తంత్ర భార‌తం..అవ‌రేజ్ 6. లాల్ స‌లామ్‌..సూప‌ర్ హిట్ 7. దండోరా..సూప‌ర్ హిట్ 8. ఎర్ర సైన్యం..బ్లాక్ బాస్ట‌ర్ 9. చీమ‌ల దండు..సూప‌ర్ హిట్ 10. ఒరేయ్ రిక్షా!..బ్లాక్ బాస్ట‌ర్ 11. ద‌ళం..సూప‌ర్ హిట్‌ 12. అర‌ణ్యం..అవ‌రేజ్‌ 13. ఎర్రోడు..అవ‌రేజ్‌14. సింగ‌న్న‌..అవ‌రేజ్‌ 15. చీక‌టి సూర్యులు..సూప‌ర్ హిట్ 16. తెలుగోడు..యావ‌రేజ్‌ 17. రైతు రాజ్యం..అవ‌రేజ్‌ 18. భీముడు..అవ‌రేజ్ 19. కూల‌న్న‌..అవ‌రేజ్‌ 20. చ‌లో అసెంబ్లీ..అవ‌రేజ్‌21.ఊరు మ‌న‌ది రా..సూప‌ర్ హిట్ 22. వేగు చుక్క‌లు..అవ‌రేజ్‌ 23. గంగ‌మ్మ జాత‌ర‌..అవ‌రేజ్‌ 24. అమ్మ మీద ఒట్టు..అవ‌రేజ్‌ 25. అడ‌వి బిడ్డ‌లు..అవ‌రేజ్‌ 26. ఎర్ర స‌ముద్రం..అవ‌రేజ్‌ 27. దేవ‌ర‌కొండ వీర‌య్య కూతురు కోసం..అవ‌రేజ్‌ 28. వీర తెలంగాణ‌…హిట్‌ 29. పోరు తెలంగాణ‌…అవ‌రేజ్‌ 30. పీపుల్స్ వార్..అవ‌రేజ్‌31. నిర్భ‌య భార‌తం..అవ‌రేజ్‌ 32. రాజ్యాధికారం..అవ‌రేజ్‌ 33. దండ‌కార‌ణ్యం..అవ‌రేజ్‌ 34.హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌..ఫ్లాప్‌ 35.అన్న‌దాత సుఖీభ‌వ..అవ‌రేజ్‌

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!