హాయ్ వ్యూవర్స్.. ఒకప్పుడు సినిమా అంటే కొన్ని రోజులపాటు హాల్‌లో ఆడేది. యాబై, వంద, 150 రోజులు అంటూ రోజుల తరబడి సినిమాలు ఆడేవి. ప్రేక్షకులు కూడా సినిమా హాళ్లకు వచ్చి చూసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు కాలం మారింది. సినిమాలను హాల్‌కు వెళ్లి చూసేందుకు ఎప్పుడో గానీ ఇష్టపడడం లేదు. రకరకాల మాధ్యమాలు ప్రభావం కూడా సినిమాలపై ఉంది. దీంతో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కొన్ని రోజులపాటు ఆడడం కష్టమవుతోంది. దీంతో యాబై, వంద రోజులు సినిమాలు ఆడే పరిస్థితి లేకుండా పోయింది. గడిచిన కొన్నాళ్లుగా వంద రోజులు ఆడే చిత్రాలనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఓ మోస్తారుగా ఉన్న సినిమా కూడా వంద రోజులు ఆడేది. తరువాత తరువాత 50 సెంటర్లు, 100 సెంటర్లు కూడా 100 డేస్ ఆడే స్థాయికి సినిమాలు ఎగబాకాయి. అయితే, 2010 నుంచి అమాంతం కింద పడిపోయాయి. వంద సెంటర్లుకుపైగా వంద రోజులు ఆడిన చిత్రాలు కేవలం ఆరో, ఏడో ఉన్నాయి. అదే 50 సెంటర్లకుపైగా వంద రోజులు ఆడిన చిత్రాలు దాదాపు 30 వరకు ఉన్నాయి. ఒకసారి ఆ సినిమాలు ఏమిటో హీరో వైజ్ చూద్దామా. వెల్ కమ్ టూ స్కై డ్రీమ్. స్మాల్ నోట్. ఈ మూవీలన్నీ రోజూ నాలుగు ఆటలతో షిఫ్ట్స్ లేకుండా వంద రోజులు డైరక్ట్‌గా ఆడినవి.
ఫస్ట్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి మొత్తంగా ఆరు సినిమాలు 50 సెంటర్స్‌కుపైగా వంద రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. మాస్టర్ సినిమా 52 సెంటర్లలో ఆడింది. చూడాలని ఉంది 63 సెంటర్లు, బావ గారు బాగున్నారా 54 సెంటర్లు, అన్నయ్య 60 సెంటర్లు, ఇంద్ర 118 సెంటర్లు, ఠాగూర్ 181 సెంటర్లలో వంద రోజులపాటు ఆడింది. వీటిలో చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్ సినిమాలు 100 డేస్ సెంటర్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాయి. నెక్ట్స్ బాలకృష్ణ. 50 సెంటర్స్‌కుపైగా 100 డేస్ ఆడిన మూవీలు బాలకృష్ణకు నాలుగు ఉన్నాయి. సమరసింహారెడ్డి 73 సెంటర్లు, నరసింహానాయుడు 105 సెంటర్లు, లక్ష్మీ నరసింహా 78 సెంటర్లు, సింహ 90 సెంటర్లులో ఆడింది. వీటిలో సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. 70 సెంటర్లకుపైగా వంద రోజులు ఆడిన నాలుగు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా నట సింహా బాలయ్య గుర్తింపు పొందాడు. అలాగే, 100 డేస్, 100 సెంటర్స్‌కుపైగా ఆడిన తొలి చిత్రంగా నరసింహనాయుడు రికార్డు సృష్టించింది.
నెక్ట్స్ నాగార్జున. నాగార్జునకు 50 సెంటర్లకుపైగా 100 డేస్ ఆడిన చిత్రాలు మూడు ఉన్నాయి. నువ్వొస్తావని 62 సెంటర్లు, మాస్ 68 సెంటర్లు, శ్రీరామదాసు 62 సెంటర్లలో ఆడాయి. సెంటర్స్ విషయంలో నాగార్జునకు ఎప్పుడూ ఆల్‌టైమ్ రికార్డు లేదు. నెక్ట్స్ వెంకటేష్. 50 సెంటర్లకుపైగా వంద రోజులు ఆడినవి ఆరు సినిమాలు వెంకటేష్ ఖాతాలో ఉన్నాయి. ప్రేమించుకుందాం రా 53 సెంటర్లు, రాజా 69 సెంటర్లు, కలిసుందాం రా 76 సెంటర్లు, నువ్వు నాకు నచ్చావ్ 57 సెంటర్లు, వసంతం 53 సెంటర్లు, లక్ష్మి 72 సెంటర్లులో ఆడాయి. వీటిలో ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాయి. ఫస్ట్ టైమ్ 50 సెంటర్లలో 100 రోజులు జరుపుకున్న మూవీగా ప్రేమించుకుందాం రా రికార్డులను సృష్టించింది. నెక్ట్స్ పవన్ కల్యాణ్. ఈ కేటగిరీలో పవన్‌కు రెండు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఖుషీ 79 సెంటర్లు, గబ్బర్ సింగ్ 54 సెంటర్లలో ఆడాయి. పవన్ కల్యాణ్‌కు సెంటర్లు విషయంలో ఎప్పుడూ రికార్డులు లేవు. నెక్ట్స్ మహేష్‌బాబు. సూపర్ స్టార్ మహేష్‌బాబుకు కూడా రెండు మాత్రమే 50 సెంటర్లకుపైగా 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయి. ఒక్కడు 98 సెంటర్లు, పోకిరి 144 సెంటర్లలో వంద రోజులు జరుపుకున్నాయి. మహేష్‌కు సెంటర్లు విషయంలో రికార్డు లేదు. పోకిరి 200 సెంటర్లు అంటారు కానీ, అవన్నీ షిప్ట్స్ మీద ఆడిన సెంటర్లు.
నెక్ట్స్ ఎన్‌టీఆర్. ఈ కేటగిరీలో ఎన్‌టీఆర్‌కు మూడు సినిమాలు ఉన్నాయి. ఆది 96 సెంటర్లు, సింహాద్రి 146 సెంటర్లు, యమ దొంగ 57 సెంటర్లలో వంద రోజులు జరుపుకున్నాయి. వీటిలో 100 డేస్ సెంటర్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. నెక్ట్స్ ప్రభాస్. ప్రభాస్‌కు కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది వర్షం 63 సెంటర్లు. నెక్ట్స్ రామ్ చరణ్. రామ్ చరణ్‌కు కూడా ఒక్క సినిమానే ఈ కేటగిరీలో ఉన్నప్పటికీ అదీ ఎవర్ గ్రీన్ రికార్డుగా నిలిచింది. పస్ట్ టైమ్ 200సెంటర్స్‌లో 100 డేస్ ఆడిన చిత్రంగా మిగిలిపోతుంది. ఆ సినిమానే మగధీర. మొత్తంగా 213 సెంటర్స్‌లో 100 డేస్ ఆడింది మగధీర. నెక్ట్స్ అల్లు అర్జున్. 85 సెంటర్స్‌లో 100 డేస్ ఆడిన దేశ ముదురు ఒక్కటే బన్నీ ఖాతాలో ఉంది. ఇలా టోటల్‌గా 29 సినిమాలు ఉండగా, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ చెరో ఆరు సినిమాలతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు