Bigg Boss 8: భారతదేశంలోని అనేక భాషలలో ప్రసారం అవుతున్నప్పటికీ, బిగ్ బాస్ తెలుగులో మాత్రం భారీ స్పందనతో దేశంలోనే నంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వాహకులు గ్యాప్ లేకుండా సీజన్ల మీద సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ ప్రసారమవుతోంది. ప్రారంభ వారాల్లోనే ఈ షో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వారం ఎలిమినేషన్‌ను నిర్ణయించే ఓటింగ్ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? అనే విషయాలు చూద్దాం! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన షో బిగ్ బాస్. ఇందులోని అన్ని సీజన్‌లు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ఎనిమిదో సీజన్ పై అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఫలితంగా అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ కాన్సెప్ట్‌తో ఈ ఎనిమిదవ సీజన్ తీసుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు డిఫరెంట్ కంటెంట్ తో ప్రసారం చేస్తున్నారు.
ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనికా, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ కాగా, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్స్ టాస్క్. అందులో జరిగే గొడవలే ఇందుకు కారణం. ఎనిమిదో సీజన్ లో కూడా ఇవి మొదటి నుంచి కనిపిస్తున్నాయి. మూడో వారంలోనూ చాలా ఫైటింగ్ కనిపించింది. ఈ వారం అభయ్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు.
ఎనిమిదో సీజన్ మూడో వారం ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌లో ఎక్కువ పాపులర్ అయిన విష్ణుప్రియ టాప్‌లో ఉంది. సాధారణ కంటెస్టెంట్ అయిన నాగ మణికంఠ కూడా భారీ ఓట్లను సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో ప్రస్తుతం విష్ణుప్రియ భీమనేని, మణికంఠ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. వాటి తర్వాత మార్పులు కనిపిస్తున్నాయి. తాజా ఓటింగ్ ప్రకారం నైనిక మూడో స్థానంలో, సీత నాలుగో స్థానంలో, ప్రేరణ ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఓటింగ్ ఇలాగే కొనసాగితే వారంతా సేఫ్. మూడో వారం ఓటింగ్‌లో యష్మీ గౌడ ఆరో స్థానంలో ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ ఏడో స్థానంలో, అభయ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. అంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇందులో అభయ్ ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభావతి 2.0 ఓ టాస్క్‌లో అతను అస్సలు ఎఫెక్టివ్‌గా లేకపోవడమే ఇందుకు కారణం.