Thursday, November 7, 2024

Bigg Boss 8 : మణికంఠనే హాట్‌గా ఉంటాడంటూ పృథ్వీ పరువు నిట్టనిలువునా తీసేసిన యష్మీ

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 27వ ఎపిసోడ్‌లో బీబీ అడ్డా టాస్క్ పూర్తయింది. హౌస్‌మేట్స్‌తో సరదాగా ఉండేలా బిగ్ బాస్ అడ్డా అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో వేరొకరి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారిలా నటించాలి. అర్ధరాత్రి 1 గంట దాటిన ఈ టాస్క్‌లో అంతా బాగానే జరిగింది. మొదట, యాంకర్‌గా ఉన్న నబీల్ అఫ్రిది అందరినీ ప్రశ్నలు అడిగాడు, ఆపై ఆదిత్య ఓం పాత్రను పోషించాడు. అదే ఆదిత్య ఓంలా నటించిన నబీల్ కామెడీని బాగా పండించి అందరినీ నవ్వించాడు. కంటెస్టెంట్స్‌తో పాటు బిగ్ బాస్ కూడా నబీల్‌ను ప్రశంసిస్తూ విజేతగా ప్రకటించారు. అంతకు ముందు యాంకర్ విష్ణుప్రియ ఉదయం సాంగ్ ప్లే చేసిన తర్వాత పృథ్వీని అందంగా రెడీ చేస్తుంది. ఆ విషయం గురించి సీత, యష్మీ, నైనికా దాని గురించి మాట్లాడుకుంటారు. విష్ణుకి అందంగా కనిపిస్తాడేమో కానీ మనకు కాదు అని సీత అంటుంది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ వేసుకున్న పృథ్వీకి కాస్త అటు ఇటు మేకప్ వేసి బయటకు తీసుకొస్తుంది.

వస్తున్నాడు.. వస్తున్నాడు.. మన ధీరుడు..శూరుడు.. పృథ్వీరాజ్ శెట్టి అని గట్టిగా అరుస్తూ పృథ్వీని పరిచయం చేసింది. కానీ, ఎవరు పెద్దగా స్పందించలేదు. అసలు ఈరోజు వాడు డంబ్ గా ఉన్నాడని సీత అంటుంది. అలా అన్ని చేస్తే వాడికంటే మణికంఠనే హాట్ గా ఉంటాడని యష్మీ అంటుంది. అది విన్న పృథ్వీ ఏమన్నావ్. ఇది నాకు అవమానం అంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఒకసారి నా కళ్లతో చూడండిరా.. అంటూ అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్ చెప్పింది విష్ణుప్రియ. ఇంతలో ఎపిసోడ్ మొదటల్లో పృథ్వీకి దెబ్బ తగిలిన చోట ఆయింట్ మెంట్ పూస్తుంది విష్ణు ప్రియ. తర్వాత సోనియా వచ్చి తినడానికి వెయిట్ చేస్తున్నట్లు చెబుతుంది. విష్ణుప్రియ లోపలికి వెళ్ళింది. ఇప్పటిదాకా ఏం చేశారు అని సీత, ప్రేరణ అడిగితే విష్ణుప్రియ చెబుతుంది.

సోనియా వాళ్లు ఉన్నారు కదా. వాళ్లు లేకుంటే ఏమో అనుకోవచ్చు అని సీత అంటుంది. అది నా పర్సనల్. నాకు పృథ్వీ అంటే ఇష్టమన్నాట్లు విష్ణు చెప్పింది. కానీ, అదంతా ఇప్పుడెందుకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా. ఎందుకు డిస్ట్రాక్షన్ అనే అర్థంలో సీత చెబుతుంది. ప్రతి మనిషికి జీవితంలో డిస్ట్రాక్షన్ ఉంటుంది కదాని కాస్తా అలిగినట్లుగా ఫేస్ పెడుతుంది విష్ణుప్రియ. మరోవైపు విష్ణుప్రియకు పృథ్వీ పడిపోతున్నాడంటూ భయమేస్తుందని నిఖిల్‌తో సోనియా చెప్పుకొంది. డిన్నర్ టేబుల్‌పై ఇదే విషయంపై సీత, ప్రేరణ కూడా మాట్లాడుకున్నారు. తను జెన్యూన్‌గా ఇష్టపడుతుంది. కానీ, వాడు మాత్రం ఆమె అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రేరణ అంటుంది. పక్కనే ఉన్న నైనిక.. ప్రతి ఒక్కరు అటెన్షన్ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆమెపై వాడు కేర్ చూపిస్తాడని చెప్పింది. ఇలా హౌజ్‌లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్ లవ్ ట్రాక్‌పైనే ఎక్కువగా డిస్కషన్ నడిచింది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!