Jagan-Mudragada: గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి జగన్ కన్నా ఎక్కువగా మరో వ్యక్తిని బాధించింది. అది మరెవ్వరో కాదు.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఎన్నికల ముందు ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా పని చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని సవాల్ కూడా విసిరాయన. ఆ సమయంలో ముద్రగడ ఫ్యామిలీ సైతం ఆయనకు వ్యతిరేకంగా మారారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ముద్రగడ , పవన్‌పై యుద్దానికే కాలు దువ్వారు.
ఆ సమయంలోనే ముద్రగడ సంచలన ప్రకటన చేశారు.య ఒకవేళ ఎన్నికల్లో పవన్ గెలిస్తే..తన పేరును మార్చుకుంటానని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో తాను చెప్పినట్టుగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుని సంచలనం సృష్టించారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఈ సమయంలోనే జగన్‌తో ముద్రగడ భేటీ అయ్యారు. ముద్రగడ పద్మనాభంతో జగన్ పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ముద్రగడకు జగన్ దిశనిర్దేశం చేశారు. ఈ సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది.
పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని, నాయకులకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తు వైసీపీదే అని క్యాడర్‌ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలను జగన్ ముద్రగడకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ రెండు జిల్లాలకు అధ్యక్షులను సైతం నియమించడం జరిగింది కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.