Tuesday, November 18, 2025

Jagan: పైకి ఏదో చెప్తున్నా జగన్ తిరుమల టూర్ రద్దుకి నిజమైన కారణం ఇదే ?!

- Advertisement -

Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తనపై దాడి చేసేందుకు తిరుపతిలో కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తు౦దని జగన్ ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళదామంటే అడ్డుకోవడానికి చూడటమేంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస రాజ్యం నడుస్తుందని జగన్ ఆరోపించారు. తనకు నోటీసులు ఇచ్చి దైవ దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని జగన్ ఆరోపించారు. దైవ దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం దేశంలో ఇది మొదటి సారి అని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ విషయం తెలుసా అని జగన్ ప్రశ్నించారు.

వేలాది మంది పోలీసులను తిరుపతి మరియు తిరుమలలో పెట్టి ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించే వాతావరణాన్ని కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రతని దెబ్బతీస్తూ చంద్రబాబు దొరికిపోయారని, జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారని అన్నారు. కేవలం డైవర్షన్ కోసమే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా పదిహేను సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారన్నారు. తమ హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపామని చెప్పారు. కల్తీ నెయ్యిని ప్రసాదంలో వాడలేదని టీటీడీ ఈవో శ్యామల రావు ఈ నెల 20వ తేదీన మీడియా ముందు చెప్పినప్పటికీ కల్తీ నెయ్యి కలిసిందంటూ అబద్ధాలు చెప్పి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బ తీశారన్నారు.

తన మతం, కులం ఏంటో ప్రజలకు తెలుసన్న జగన్, తన మతం మానవత్వమని అన్నారు. నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని చెప్పుకొచ్చారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని, హిందూ మత ఆచారాలను పాటిస్తానని జగన్ తెలిపారు. తన మతం ఏమిటని అడుగుతున్నారని, తన మతం మానవత్వమని ఆయన తెలిపారు. డిక్లరేషన్ లో నా మతం మానవత్వం అని రాసుకోండి అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమిలోని పార్టీలు చంద్రబాబు లడ్డూపై అపచారం చేసేలా ప్రశ్నిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు ఏపీలోనూ మొదలు పెట్టారని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన చెప్పు చేతుల్లో ఉండే అధికారులతో సిట్ వేశారన్న జగన్, రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాని మోడీతో తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదని జగన్ ప్రశ్నించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో చంద్రబాబు చేసిన పాపాలు ప్రక్షాళన చేయాలంటూ పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మత కల్లోలాలు మరియు గొడవలు జరిపి కూటమి వాటిని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని, అక్కడ వందలాది పోలీసులని పెట్టి కావాలనే గొడవ వాతావరణం సృష్టించి ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తుంది కాబట్టి జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని వైసీపీ మీడియా ప్రచురించింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!