Monday, February 10, 2025

డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కు నిర్మాత నాగ వంశీ గైర్హాజరు.. కారణం జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ ఆగ్రహం!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణకు విభేదాలు తారాస్థాయికి చేరాయా? తారక్ ను బాలకృష్ణ ఒక శత్రువుగా చూస్తున్నారా? నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ ఫ్యామిలీని వెలివేశారా? ఆ కుటుంబంలో సఖ్యత ఎండమావేన? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెరపైకి వచ్చారు బాలకృష్ణ. ఆ కుటుంబం నుంచి నట వారసుడిగా అడుగుపెట్టారు. అటు తరువాత నందమూరి హరికృష్ణ అడపాదడపా సినిమాల్లో కనిపించారు. అయితే హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ సైతం సినీ రంగంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయితే నందమూరి కుటుంబమే ఆయనను దూరం పెట్టిందన్న టాక్ కూడా ఉంది.

అయితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో ఇటీవల ఒక ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ ముందు సక్సెస్ గా నిలిచింది. పెద్ద ఎత్తున వసూళ్లను కొల్లగొడుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఉన్నారు. నాగ వంశీ నిర్మాతగా.. బాబీ దర్శకుడుగా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో యూనిట్ ఖుషి గా ఉంది. అయితే సక్సెస్ మీట్ ను అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ మొత్తం తరలివచ్చింది. కానీ నాగ వంశీ మాత్రం హాజరు కాలేదు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. నాగ వంశీ జూనియర్ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవరా చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో నష్టాలు తప్పవని భావించారు. ఆ సమయంలో నాగ వంశీ అండగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ను ఇబ్బందుల నుంచి బయట పడేశారు. అప్పటినుంచి ఇద్దరు సన్నిహితులుగా మారారు. త్వరలో నాగ వంశీ నిర్మాతగా ఓ సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధపడ్డారు. త్వరలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ ఆదేశాలు మేరకు నాగ వంశీ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ కు రాలేదన్నది ఒక ప్రచారం నడుస్తోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణకు విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతగానో సక్సెస్ అయ్యింది. చాలామంది హీరోలు, సెలబ్రిటీలు వచ్చారు. అయితే సినీ పరిశ్రమ వ్యక్తుల గురించి ఈ సోలో ప్రస్తావన వస్తుంది. అయితే తారక్ దర్శకులు, సహచరులు వచ్చిన ఎక్కడ ఆయన ప్రస్తావన లేకుండా బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారంటే.. వారి మధ్య ఏ స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన తారక్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్కు అభినందనలు తెలిపారు. కానీ బాలకృష్ణ నుంచి ఒక్క అభినందన కాదు కదా.. సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన దాఖలాలు లేవు.

అయితే నందమూరి కుటుంబంలో హరికృష్ణ ఫ్యామిలీ ఏకాకి అయ్యిందన్న టాక్ ఉంది. అదే సమయంలో హరికృష్ణ కుమార్తె సుహాసిని అందరితో కలిసి ఉంటున్నారు. ఆమె సోదరుడు కళ్యాణ్ రామ్ మాత్రం తారక్ తోనే జర్నీ చేస్తున్నారు. అయితే తెర వెనుక చాలా జరిగిందని.. రాజకీయాల కోసమే తారక్ను పక్కన పెట్టారన్న టాక్ ఉంది. అయితే అంతకుమించి కుటుంబ పరంగా కూడా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే బాబాయితో అబ్బాయిలు కలిసిపోతే బాగున్ను అని సగటు నందమూరి అభిమానులు కోరుతున్నారు. కానీ ఈ విషయంలో బాలకృష్ణ మరి మొండిగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!