Monday, February 10, 2025

నియోజకవర్గాలకు దూరంగా కూటమి ఎంపీలు!

- Advertisement -

ఏపీలో ఆ ఎంపీల జాడలేదు ఎందుకు? కూటమి నుంచి గెలిచిన ఎంపీలు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? విలువ లేదని బాధపడుతున్నారా? ఎమ్మెల్యే అయి ఉంటే బాగుండేదని భావిస్తున్నారా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడు నెలలు అవుతోంది. కానీ కొంతమంది ఎంపీలు మాత్రం ఇంతవరకు యాక్టివ్ కావడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెనుకబడి ఉన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. పైగా లోకల్ ఎమ్మెల్యే లతో పొసగడం లేదు. మూడు పార్టీల ప్రజాప్రతినిధులు ఉండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సమన్వయం లేక కొంతమంది ఎంపీలు సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో చాలామంది ఎంపీలు ఉన్నారన్న విషయాన్ని ప్రజలే మరిచిపోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరుపున 21 మంది ఎంపీలు గెలిచారు. వైసీపీ నుంచి నలుగురు ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి ముగ్గురుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా దక్కింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గెలిచారు. రాష్ట్ర బిజెపి నుంచి కేంద్ర సహాయ మంత్రి పదవిని పొందారు. అంటే 21 మంది ఎంపీల్లో.. 18 మంది సాధారణ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ 18 మందిలో ప్రజలకు అందుబాటులో ఉన్నది ఒకరిద్దరు మాత్రమే. మిగతా మెజారిటీ సభ్యులు ప్రజలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి.

ప్రధానంగా కూటమి పార్టీల ఎంపీలు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలకి పరిమితం అవుతున్నారు. చాలామంది కీలక సమావేశాలకు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటున్నారు అన్న విమర్శ ఉంది. అయితే ఈసారి సమీకరణలో భాగంగా కొత్తవారికి అవకాశం వచ్చింది. తొలిసారిగా ఎంపీలు అయిన వారు సైతం ఉన్నారు. దీంతో చాలామందికి ఎంపీల పదవి బాధ్యతలపై అవగాహన లేదు. అందుకే వారు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండలేకపోతున్నారన్న విమర్శ ఉంది.

రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీలలో తొలి స్థానంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఆయన ఓ సాధారణ టిడిపి కార్యకర్త. చంద్రబాబు పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచారు. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అయితే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు, ఇతరత్రా ప్రైవేట్ వ్యవహారాలు ఉన్నాయి. అటువంటివారు నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండడం లేదు.

బిజెపితో పాటు జనసేనకు ఐదుగురు ఎంపీలు ఉన్నారు. అటువంటి నియోజకవర్గాల్లో ఎంపీలు తో ఎమ్మెల్యేలకు విభేదాలు ప్రారంభమయ్యాయి. అలాగే బిజెపితో పాటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట.. టిడిపి ఎంపీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటితో ఎంపీలు నియోజకవర్గాల పర్యటనలను తగ్గించుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల బాహటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో బిజెపి ఎమ్మెల్యేలు వర్సెస్ టిడిపి ఎమ్మెల్యేలు అనంత పరిస్థితి ఉంది. ఇసుకతో పాటు మద్యం విషయంలో తేడా కొట్టింది. ఈ పరిణామాలన్నీ ఎంపీలపై పడుతోంది. అందుకే చాలామంది ఎంపీలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఇష్టపడడం లేదు. స్థానికంగా పర్యటిస్తే ఎమ్మెల్యే కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలతో పార్లమెంటు నియోజకవర్గం లో పర్యటించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎంపీలు. ఇంకోవైపు ఎక్కువమంది ప్రైవేట్ సేవలో తరిస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు దూరమవుతున్నారన్న విమర్శ ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!