తిరుపతి తొక్కిసలాట ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. తిరుమల చరిత్రను మసకబార్చింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కొందరు అధికారులపై బదిలీ వేటు వేసింది. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. కొద్ది రోజుల్లో ఈవో తో పాటు అడిషనల్ ఈవో పై కూడా చర్యలు తప్పవని ప్రచారం జరుగుతుంది. అయితే మొత్తం ఎపిసోడ్లో కుల ప్రభావం అధికంగా ఉందని టాక్ నడిచింది. కమ్మ సామాజిక వర్గం అధికారులను కాపాడే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వినిపించాయి. మిగతా సామాజిక వర్గానికి చెందిన అధికారులపై ఇట్టే చర్యలకు ఉపక్రమించారని విమర్శలు వచ్చాయి.
మరోవైపు ఈ ఘటనకు ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పై బదిలీ వేటు పడింది. అయితే ఉత్తిపాటి అని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యుడిని చేస్తూ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తో పాటు జెఈఓ గౌతమి పై బదిలీ వేటు వేశారు. కానీ ఇప్పుడు అదే సుబ్బారాయుడని తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీపై నియమించడం విశేషం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే సుబ్బారాయుడు విషయంలో మరోసారి పోస్టింగ్ ఇచ్చారని అధికార వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
వాస్తవానికి ఐపీఎస్ ఆఫీసర్ సుబ్బారాయుడు తెలంగాణ క్యాడర్ కు చెందినవారు. డిప్యూటేషన్ పై ఆయనను చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. కానీ తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యుడిని చేస్తూ ఆయన పై బదిలీ వేటు వేయాల్సి వచ్చింది. కానీ ఆయనపై ఉన్న అభిమానంతో తిరిగి తిరుపతిలో ఉండేలా పోస్టింగ్ ఇవ్వడం మాత్రం చర్చకు దారితీస్తోంది. తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడిని తాజా బదిలీల్లో నియమించడం విశేషం. అయితే ఆయనతోపాటు బదిలీ వేటకు గురైన టీటీడీ జేఈవో గౌతమికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కేవలం సామాజిక వర్గం కోణంలోనే ఇలా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఒకే తప్పు పై ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసినప్పుడు.. అందులో ఒకరికి ఎలా పోస్టింగ్ ఇస్తారు అన్నది ప్రశ్న. ఇక్కడ తప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సుబ్బారాయుడికి పోస్టింగ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అధికార వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి ఘటన జరిగి రెండు వారాలు కూడా దాటలేదు. దానికి ప్రధాన బాధ్యుడైన తిరుపతి ఎస్పీకి పోస్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటుందో పాలకులకే తెలియాలి. చివరికి ఉన్నత ఉద్యోగులను కూడా కులాల ప్రాతిపదికన వేరు చేయడం దారుణం.