Monday, February 10, 2025

లోకేష్ సిఫారసు తోనే కాకినాడ ఎస్పీ నియామకం

- Advertisement -

కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ నియమితులయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు అక్కడ చోటు దక్కింది. అయితే దీని వెనుక లోకేష్ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. బిందు మాధవ్ పల్నాడు ఎస్పీగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల కమిషన్ జోక్యంతో అప్పట్లో ఆయన బదిలీ జరిగింది. ఆయనపై టిడిపి అనుకూల అధికారిగా ముద్ర ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన కాకినాడ ఎస్పీగా నియమితులు కావడం విశేషం. దీని వెనుక లోకేష్ చక్రం తిప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే దానికి కారణం లేకపోలేదు. తెర వెనుక అనేక రకాల వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలోకి వస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. ఇంకోవైపు కాకినాడ ఎంపీగా జనసేనకు చెందిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన కాకినాడ జిల్లాలో బలంగా ఉంది. పైగా జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న యనమల రామకృష్ణుడు క్రియాశీలక రాజకీయాలు తగ్గించారు. అందుకే ఇక్కడ పోలీస్ శాఖ పరంగా వీక్ అయితే టిడిపి శ్రేణులు వెనక్కి తగ్గుతాయని లోకేష్ భావించారు. అందుకే అక్కడ జిల్లాలో టిడిపి ఆదిపత్యం తగ్గకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగమే తన సన్నిహితుడు సానా సతీష్ కు రాజ్యసభ పదవిగా ప్రచారం నడుస్తోంది. రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరించగల సామర్థ్యం సానా సతీష్ కు ఉంది. రాజ్యసభ పదవికి ఆయన ఎంపిక వెనుక వ్యూహం అదేనని తెలుస్తోంది.

బిందు మాధవ్ ను ఎస్పీ చేసి.. ఆయన సేవలను టిడిపి కోసం వినియోగించుకోవాలన్నది లోకేష్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే పోలీస్ బాస్ గా తన మనిషి ని నియమించాలని లోకేష్ పట్టుబడినట్లు తెలిసింది. లోకేష్ కు దగ్గరి అధికారిగా పేరున్న బిందు మాధవ్ కు కాకినాడ ఎస్పీ గారి నియమించడం ద్వారా యనమల రామకృష్ణుడు ని పూర్తిగా చెక్ పెట్టారు. అదే సమయంలో జనసేనకు దీటైన నాయకత్వాన్ని సానా సతీష్ రూపంలో తెరపైకి తెచ్చారు. కాకినాడ జిల్లాలో జనసేన నాయకులు పోలీస్స్టేషన్లో హవా కొనసాగిస్తున్నట్లు లోకేష్ కు ఫిర్యాదులు ఉన్నాయి.

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన టిడిపి శ్రేణులను లెక్కచేయడం లేదు. కనీసం వారికి విలువ ఇవ్వడం లేదు. దీనిపై లోకేష్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ను మరింత శక్తివంతుడు చేయడం లోకేష్ ముందు ఉన్న కర్తవ్యం. అందులో భాగంగానే తన అస్మదీయ అధికారిగా గుర్తింపు పొందిన బిందు మాధవ్ ను కాకినాడ ఎస్పీ కార్యాలయంలోకి పంపించగలిగారు లోకేష్. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చెక్ చెప్పడమే కాదు.. జనసేన ప్రభావాన్ని తగ్గించాలన్న ద్విముఖ వ్యూహంతోనే ఇలా చేసినట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే కాకినాడ విషయంలో లోకేష్ గట్టి ప్లాన్ తోనే ఉన్నారు. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎటు వైపునకు దారితీస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!