Monday, February 10, 2025

రెడ్డి సామాజిక వర్గంలో అంతర్మధనం.. కూటమికి భారీ డ్యామేజ్!

- Advertisement -

రెడ్డి సామాజిక వర్గం సంఘటితం అవుతోందా? ఆ సామాజిక వర్గంలో అంతర్మదనం ప్రారంభం అయ్యిందా? కూటమి ప్రభుత్వంలో తమ వారికి అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోందా? 2029 ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరుకోనందా? రెడ్డి సామాజిక వర్గమంతా ఏకతాటి పైకి వస్తుందా? జగన్ కు అండగా నిలుస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని కూటమి నేతలు ఆరోపించారు. అయితే అన్యాయం మాట అటు ఉంచితే.. రెడ్డి సామాజిక వర్గానికి అనుకున్న స్థాయిలో ప్రయోజనం చేకూరలేదన్నది వాస్తవం. బీసీల తో పాటు ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఈ తరుణంలోనే సొంత సామాజిక వర్గానికి ఏం చేయలేదన్న విమర్శ మూటగట్టుకున్నారు. అయితే ఒకవైపు జగన్ పై కులముద్ర వేస్తూనే.. కులానికి ఏం చేయలేదన్న విమర్శలు కూడా చేశారు కూటమి నేతలు. రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ కాగా.. తాను ప్రోత్సహించిన ఇతర సామాజిక వర్గాల వారు వైసీపీని ఆదరించలేదు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో భారీ ఓటమి.

ఇప్పుడు పాలనా యంత్రాంగంలో రెండు కులాల ఆధిపత్యం కొనసాగుతోంది. పోలీస్ శాఖలో కిందిస్థాయి ఎస్సై నుంచి డీజిపి వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులు కనిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాపులకు కూడా ప్రాధాన్యత లభిస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు కోపం రాకుండా కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. ఇప్పుడు ఎటు వచ్చి పోయింది రెడ్డి సామాజిక వర్గం. ఏసీబీ, సిఐడి వంటి లూప్ హోల్స్ పోస్టుల్లో రెడ్డి సామాజిక వర్గం అధికారులు ఉంటున్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన ఆవేదన, ఆక్రోసం కనిపిస్తోంది. జగన్ హయాంలో తమకు ప్రాధాన్యత లేదని వాపోయిన రెడ్డి సామాజిక వర్గం.. ఇప్పుడు అసలు వస్తుండడంతో ఆవేదనతో ఉంది.

పోనీ రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారంటే అది లేదు. ఎన్నికల్లో రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ కావడం నిజం. దానిని కూటమి క్యాష్ చేసుకుంది. వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. అయితే కనీసం రెడ్డి సామాజిక వర్గానికి ఏ జిల్లాలో కూడా గుర్తింపు ఇవ్వలేదు. కీలక నేతలను పక్కనపెట్టి డమ్మీ నేతలను మంత్రులుగా చేశారన్న విమర్శ ఉంది. యువకులకు పెద్దపీట అంటూ సీనియర్లను పక్కన పెట్టారు. కనీస స్థాయిలో కూడా వారికి గుర్తింపు లేకుండా పోవడంతో వారిలో ఆవేదన నెలకొంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం మధ్య అగాధాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి. ఇటీవల అనంతపురం, కడప జిల్లాలో జరిగిన ఘటనలే ఉదాహరణలు. నెల్లూరు నుంచి గెలిచిన నేతలకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు. చిత్తూరు జిల్లా సీఎం సొంతది కావడంతో ఎటు ప్రాధాన్యత లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలో సీనియర్ల సేవలను ఉపయోగించుకోవడం లేదు. కడప జిల్లా పై వివక్ష కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో రెడ్డి సామాజిక వర్గం లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.

రెడ్డి సామాజిక వర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గ నేత ఆయన. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పార్టీ నీడను ఎన్నడూ విడిచిపెట్టలేదు. అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. అనంతపురంలో జెసి ఫ్యామిలీలో కూడా అదే పరిస్థితి. 2019లో ఓడిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉన్నా.. ఒక్కరికే పరిమితం చేశారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇబ్బందులు పడిన జెసి ఫ్యామిలీకి అండగా నిలవడం లేదన్న విమర్శ కూడా ఉంది. కనీసం తమ వ్యాపారాల పునరుద్ధరణకు ప్రభుత్వం సహకరించడం లేదన్నది జెసి కుటుంబ ఆవేదన. ఇలా చెప్పుకుంటే రాజకీయ, ఆర్థిక, పాలనాపరమైన అంశాలలో రెడ్డి సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతోంది. ఇది మరింత తీవ్రమైతే కూటమికి భారీ డ్యామేజ్ తప్పదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!