Monday, February 10, 2025

చంద్రబాబు చీకటి ఒప్పందాలను బయటపెట్టిన రామచంద్ర యాదవ్

- Advertisement -

బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందా? నమ్మకద్రోహానికి పాల్పడిందా? అంటే అవునంటున్నారు రామచంద్ర యాదవ్. కొద్దిరోజుల కిందట బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు రామచంద్ర యాదవ్. ఎట్టి పరిస్థితుల్లో పుంగనూరులో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తానని శపధం చేశారు. దీనికి తెలుగుదేశం పార్టీ మరింత ప్రోత్సాహం అందించింది. రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పుడు అదే రామచంద్ర యాదవ్ చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి గెలుపు కోసం చంద్రబాబు పుంగనూరులో బలహీన అభ్యర్థిని పెట్టారని చెప్పుకొచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబంతో పూర్తిగా రాజీ పడిపోయారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.

భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేశారు రామచంద్ర యాదవ్. భారీగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదిపేవారు. జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తీవ్ర విమర్శలు చేసేవారు. అప్పట్లో చంద్రబాబు తెరవెనుక ఉండి రామచంద్ర యాదవ్ తో కద నడిపించే వారన్న ప్రచారం ఉండేది. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని.. రామచంద్ర యాదవ్ కు సపోర్ట్ చేస్తుందని కూడా టాక్ నడిచింది. కానీ చివరి నిమిషంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టిడిపి అభ్యర్థిని పెట్టారు. రామచంద్ర యాదవ్ సైతం పోటీ చేశారు. ఆయనకు 4,500 ఓట్లు వరకు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో చంద్రబాబు లోపాయి కారి ఒప్పందం చేసుకున్నారని రామచంద్ర యాదవ్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేయడం విశేషం.

గత కొద్దిరోజులుగా పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్ గా ఉంది. పొలిటికల్ గా యాక్టివ్ గా లేదు. వైసీపీ అధినేత జగన్ వెనుక కూడా పెద్దగా కనిపించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో రామచంద్ర యాదవ్ ఈ సంచలన ఆరోపణలు చేయడం విశేషం. పెద్దిరెడ్డికి చెందిన షిరిడి సాయి సంస్థ నుంచి టీడీపీకి భారీగా డబ్బులు ముట్టాయి అన్నది రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆరోపణ. అటు తంబళ్లపల్లెలో సైతం బలహీన అభ్యర్థిని పెట్టారని.. అక్కడ పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలుపు కోసం టిడిపి సహకరించిందని కూడా చెప్తున్నారు.

అంతటితో ఆగని రామచంద్ర యాదవ్ ఎన్నికలకు ముందు జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అవుతోంది. టిడిపికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ హైదరాబాదులో తనతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు. భారత చైతన్య యువజన పార్టీని టిడిపిలో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన పెట్టారని.. అందుకు తాను అంగీకరించలేదని చెబుతున్నారు రామచంద్ర యాదవ్. ఈ విషయంలో తనకు చాలా మోసం జరిగిందని.. తెలుగుదేశం పార్టీ నమ్మించి మోసం చేసిందని చెబుతున్నారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటి బయటపడుతుండడం విశేషం.https://youtu.be/7vwl5J1IO04?si=OffF1Vlt20uD5cwG

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!