Monday, February 10, 2025

భీమిలిపై జగన్ మాస్టర్ ప్లాన్.. తెరపైకి చిన్న శ్రీను!

- Advertisement -

ఉత్తరాంధ్ర పై వైసీపీ అధినేత జగన్ భారీ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. సమూల ప్రక్షాళనకు దిగారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన.. వచ్చిన వెంటనే జిల్లాల పర్యటనను మొదలుపెట్టనున్నారు. పార్లమెంటు నియోజకవర్గం లో వారానికి రెండు రోజులు పాటు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి తన జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కీలక నియోజకవర్గాల కు ఇన్చార్జిలను నియమిస్తున్నారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను విజయనగరానికి చెందిన మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. ఈయన బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు.

ఉత్తరాంధ్రలో అన్నిటికంటే హాట్ సీట్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం. ఎంతోమంది హేమహేమీలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూనే వచ్చింది. 2004లో దానికి చెప్పారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 2009లో చిరంజీవి వేవ్ తో ప్రజారాజ్యం పార్టీ అక్కడ గెలిచింది. 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2019లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. 2024 లో వైసీపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు పై టిడిపి అభ్యర్థి గంటా గెలుపొందారు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా మజ్జి శ్రీనివాసరావు నియమితులయ్యారు.

ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. కాపులు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ కు ఇక్కడ 44% ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో సైతం 40 శాతం వరకు ఓట్లు లభించాయి. అందుకే ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారని భావించి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు జగన్. ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబానికి ఇప్పటికి మంచి పట్టు ఉంది. విజయనగరానికి కూతవేటు దూరంలో ఉంటుంది భీమిలి నియోజకవర్గం. పార్టీలకు అతీతంగా బొత్స కుటుంబానికి ఇక్కడ ఆదరణ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా బంధుత్వాలు కూడా ఉన్నాయి. అన్ని ఆలోచించి జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఉన్నారు. పైగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఇద్దరి హవాను తట్టుకుని నిలబడగలిగే నేత అవసరం. అందుకే ఆర్థిక అంగ బలం కలిగిన బొత్స కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తారని.. అప్పుడు భీమిలి నియోజకవర్గం కీలకని కానుందని అంచనా వేస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే బొత్స కుటుంబానికి భీమిలి నియోజకవర్గాన్ని అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!