Wednesday, February 12, 2025

జగన్ కుమార్తె ఆలోచనకి హాట్సాఫ్.. నెలకి 10 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగం

- Advertisement -

తాత మహానేత. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయకుడు. మహానేతగా గుర్తించబడ్డారు. తండ్రి జనాకర్షణ కలిగిన నాయకుడు. చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరియు దిగ్గజ పారిశ్రామికవేత్త. ఆయన పిల్లలు ఎలా ఉండాలి. ఎంత దర్పం ప్రదర్శించాలి. కానీ ఓ సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన వారసురాలిగా ఉండిపోయారు. సాధారణ జీవితానికి ప్రాధాన్యమిచ్చారు. ఇంతకీ వారు ఎవరో తెలుసా? మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మనవరాలు. జనాకర్షణ కలిగిన ప్రియతమ నేతగా గుర్తింపబడిన జగన్మోహన్ రెడ్డి కుమార్తె. హర్షా రెడ్డి.. ఎలుగింటి సంధింటి వారి బిడ్డ.

ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం నుంచి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే ఆయన కుమార్తె హర్ష రెడ్డి గురించి. కుమార్తె డిగ్రీ పట్టా ప్రధాన ఉత్సవం గురించి ఆయన లండన్ వెళ్లారు. ఈ విదేశీ పర్యటనకు సంబంధించి సిబిఐ కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ తరుణంలో ఆయన కుటుంబం గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి సింప్లిసిటీ బయటపడింది. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె లండన్ లో ఒక సాదాసీదా జీవితం గడుపుతున్నట్లు బయటపడింది. అక్కడే చదువుకుంటున్న ఆమె.. తన చదువుకు కావాల్సిన పెట్టుబడి కూడా తానే సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు పది లక్షల రూపాయల ప్యాకేజీగా వేతనం తీసుకున్నట్లు సమాచారం. తన కుటుంబ వ్యాపారాలు, ఆస్తులపై వేలాదిమంది బతుకుతున్న తరుణంలో.. వైయస్ హర్షా రెడ్డి తనకు తాను స్వయం ఉపాధి పొందడం.. ఉద్యోగం చేస్తుండడం విశేషం.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు హర్షా రెడ్డి. బాల్యం నుంచి చదువుల్లో ముందుండే వారు. అన్ని పరీక్షల్లోను డిస్టింక్షన్ సాధించారు. తాత వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం సమయంలో ఆమె చిరుప్రాయంలో ఉన్నారు. జగన్ జైలుకి వెళ్ళిన సమయంలో కూడా ఆమె చదువులపై ఆసక్తి కోల్పోలేదు. అనుకున్నది సాధించారు. అత్యున్నత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు పూర్తి చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా ఉద్యోగం సాధించారు. కానీ ఆమె ఉన్నత చదువుల కోసం ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా పరిగణించే ఇన్ సీడ్ కు వెళ్లారు.

ప్రస్తుతం ఆమె ఒక అంతర్జాతీయ సంస్థలో పనిచేస్తున్నారు. తన తండ్రి తో పాటు తల్లి ఆధ్వర్యంలో నడుస్తున్న పరిశ్రమల్లో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. కానీ ఆమె మాత్రం అత్యంత సాదాసీదా జీవితాన్ని మాత్రమే కోరుకున్నారు. తనకు తాను సొంతంగా ఉద్యోగం పొందారు. నెలకు 10 లక్షల రూపాయల వేతనానికి సంబంధించి ఉద్యోగం పొందారు. ఏపీ రాజకీయాలనే శాసించిన ఒక కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం.https://youtu.be/7vwl5J1IO04?si=OffF1Vlt20uD5cwG

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!