నో డౌట్.. చంద్రబాబు ఉన్నంతవరకు టిడిపి తో పాటు కూటమికి ఆయనే సారథి. ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఆయనే. ఇందులో మరో మాటకు తావులేదు. రకరకాలుగా ప్రచారం చేస్తున్న.. ఎవరికి వారుగా ప్రమోట్ అవుతున్నా… చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి. అయితే అది తెలుగుదేశం పార్టీ తరఫున.. లేకుంటే కూటమి తరుపున. అంతవరకు ఓకే. కానీ ఆయన తరువాత పరిస్థితి ఏంటి? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒక సమాధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకో సమాధానంగా ఆయన వారసుడు నారా లోకేష్ ఉన్నారు. ఎవరికి వారి అభిప్రాయాలు ఉన్నా.. ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నా.. ఇది మాత్రం అంతు పట్టని విషయం. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. జనసేనకు చరిస్మ ఉంది. అందుకే ఈ విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. కానీ ఆ బలానికి పవన్ తోడు కావాలి. అది జరగాలంటే అధికారం షేరింగ్ కావాలి. అయితే ఈ విషయంలో టిడిపి నుంచి అధిక అభ్యంతరాలు ఉన్నాయి.
చంద్రబాబు, పవన్ మధ్య బాండింగ్ ఓకే. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు కష్ట కాలంలో ఉండగా అండగా నిలిచారు పవన్. అంతవరకు ఓకే. ఈ విషయంలో పవన్ చొరవను టిడిపి శ్రేణులు ఇష్టపడతాయి. కానీ చంద్రబాబు తర్వాత పవన్ అంటే ఊరుకునే పరిస్థితి లేదు. టిడిపి శ్రేణులు దీని పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. అంతకుమించి టిడిపి అనుకూల మీడియా వ్యతిరేకిస్తుంది. ఎక్కడ చంద్రబాబు నుంచి పవర్ పవన్ కళ్యాణ్ కు చేరిపోతుందోనన్న ఆందోళన ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు లోకేష్ ఈ విషయంలో బయటపడకపోయినా.. ఆయన అభిప్రాయాన్ని బయటపెడుతోంది టిడిపి అనుకూల మీడియా. ముఖ్యంగా టిడిపి భావజాలాన్ని ప్రదర్శిస్తారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇప్పటికే అనేక సందర్భాల్లో తన భావజాలాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని బలంగా కోరుకుంటున్నారు. అదే విషయాన్ని తన మీడియా ద్వారా బయట పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఒక్క రాధాకృష్ణ కాదు. సగటు టిడిపి అభిమాని కోరుకుంటున్నది కూడా అదే. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉంటాయి అనడం సరికాదు. అందులోనూ రాజకీయంలో అది సాధ్యం కాదు కూడా. ఆ విషయాన్ని గ్రహించి టిడిపి సన్నిహితులు, చంద్రబాబు హితులు లోకేష్ నాయకత్వానికి ఇదే సరైన కాలమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. వారు వీరు అని చెప్పలేము కానీ సగటు టిడిపి అభిమాని అదే కోరుకుంటున్నారు. జనసేన తో పాటు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఇష్టపడని వారు సడన్ గా ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు.
ఎక్కడో ఓ చోట ఇదే అభిప్రాయం రానిది.. ఏబీఎన్ రాధాకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టారు. కచ్చితంగా టిడిపి తో పాటు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టడంలో ముందుంటారు రాధాకృష్ణ. అందుకే కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు స్లో వెర్షన్ లో లోకేష్ నాయకత్వం గురించి బయటపడుతున్నారు. చంద్రబాబుకు సలహా ఇస్తున్నట్టే.. పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కంటే పవన్ నుంచే చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే వ్యూహం కాదు కానీ.. 2029 తర్వాత లోకేష్ ప్రమోట్ చేసి.. అవసరమైతే పవన్ ను పక్కన పెట్టాలని సూచన చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తూనే.. భవిష్యత్ రాజకీయాలకు ఇప్పుడే వ్యూహం రచించాలని చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు.https://youtu.be/7vwl5J1IO04?si=OffF1Vlt20uD5cwG