Monday, February 10, 2025

రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖరం మృతి.. నాడు తండ్రి.. నేడు జగన్ చేయూత

- Advertisement -

వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట చాలామంది అడుగులు వేశారు. అందులో రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయులు ఉన్నారు. అటువంటి వారిలో ముందుంటారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖరం. అత్యంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. అసలు సిసలైన కాంగ్రెస్ వాది. కానీ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు నడిచాయి. ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగు నాట సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. అయితే అదే పరిస్థితిల్లో వందలాది మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు. అటువంటి వారిలో పాలవలస రాజశేఖరం ఒకరు. నియోజకవర్గాల రిజర్వేషన్ ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా.. జిల్లా పరిషత్ వంటి ముఖ్య పదవులు ఇచ్చి గౌరవించారు రాజశేఖర్ రెడ్డి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు పాలవలస రాజశేఖరం. ఆ కృతజ్ఞతతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు రాజశేఖరం. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా.. జగన్ చేతిని విడవలేదు. కానీ వయోభారంతో ఆయన మృతి చెందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విధేయతకు నిలువెత్తు నిదర్శనం పాలవలస కుటుంబం.

పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా అడుగుపెట్టని చోటు లేదు. సర్పంచ్ గా గెలిచి గ్రామస్థాయి రాజకీయాల్లోని అనుభవం సాధించారు. నేరుగా చట్టసభల్లోని అడుగు పెట్టారు. 1994 లో నందమూరి తారక రామారావు ప్రభంజనంతో ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి. అటువంటి సమయంలో గెలిచిన ఒకే ఒక నేత పాలవలస రాజశేఖరం. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన నేతగా మారారు. 2006 నుంచి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఆ పార్టీకి ఎదురోడి నిలిచారు రాజశేఖరం.

పాలవలస కుటుంబంలో తరువాత తరానికి కూడా జగన్ చాలా రకాల అవకాశం ఇచ్చారు. రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతికి పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఆమె పాత పట్టణం నియోజకవర్గానికి వలస నేత. ఆమె అభ్యర్థిత్వాన్ని చాలామంది వ్యతిరేకించారు. అయినా సరే ఆ కుటుంబం పై ఉన్న ప్రేమతో అంగీకరించారు జగన్. అంతటితో ఆగని జగన్.. కుమారుడు పాలవలస విక్రాంత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అరుదైన గౌరవాన్ని కల్పించారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదవుల రారాజుగా నిలిచారు ఆయన. ఆయన తల్లి పాలవలస రుక్మినమ్మ ఉనుకూరు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన తండ్రి సంఘం నాయుడు మంచి నేపథ్యమున్న రాజకీయ నాయకుడు. వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖరమ్. ఎన్నెన్నో పదవులు నిర్వర్తించారు. చేసిన పదవులకు వన్నెతెచ్చారు. కానీ అంతటి నాయకుడుకు గుర్తింపు ఇచ్చిన కుటుంబం మాత్రం వైయస్సార్ కుటుంబానికి చెందుతుంది ఆ ఘనత. సుదీర్ఘకాలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కల్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. డిసిసిబి చైర్మన్గా అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆయన కుమార్తె రెడ్డి శాంతితో పాటు కుమారుడు విక్రాంతుకు రాజకీయ జీవితం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. రాజశేఖరం అకాల మృతి తనను కలిసివేసిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదవుల రారాజుగా నిలిచారు ఆయన. ఆయన తల్లి పాలవలస రుక్మినమ్మ ఉనుకూరు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన తండ్రి సంఘం నాయుడు మంచి నేపథ్యమున్న రాజకీయ నాయకుడు. వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖరమ్. ఎన్నెన్నో పదవులు నిర్వర్తించారు. చేసిన పదవులకు వన్నెతెచ్చారు. కానీ అంతటి నాయకుడుకు గుర్తింపు ఇచ్చిన కుటుంబం మాత్రం వైయస్సార్ కుటుంబానికి చెందుతుంది ఆ ఘనత. సుదీర్ఘకాలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కల్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. డిసిసిబి చైర్మన్గా అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆయన కుమార్తె రెడ్డి శాంతితో పాటు కుమారుడు విక్రాంతుకు రాజకీయ జీవితం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. రాజశేఖరం అకాల మృతి తనను కలిసివేసిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.https://youtu.be/7vwl5J1IO04?si=OffF1Vlt20uD5cwG

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!