Monday, February 10, 2025

ఆ రాజ్యసభ సీటు బిజెపికే.. చిరంజీవి లేదా కిరణ్ కుమార్ రెడ్డి!

- Advertisement -

చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తారా? బిజెపి నుంచి ఆయనకు కేటాయిస్తారా? తద్వారా ఏపీలో బలపడాలని బిజెపి భావిస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఈ ప్రచారం తెగ నడుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ పదవి ఖాళీ అయింది. దానికోసం మూడు పార్టీల్లో ఆశావాహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ రాజ్యసభ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మొన్న మూడు రాజ్యసభ సీట్లు భర్తీ చేసిన సమయంలో జనసేనకు చాన్స్ దక్కలేదు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు టిడిపి పొందగా.. మరో స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. చివరి నిమిషంలో బిజెపి తెరపైకి రావడంతో జనసేన పక్కకు తప్పుకుంది. అందుకే ఇప్పుడు జనసేనకు రాజ్యసభ పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. మొన్నటికి మొన్న ఏపీ పర్యటనకు వచ్చారు హోం మంత్రి అమిత్ షా. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించారు. అప్పుడే విజయసాయిరెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చిందట. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన పదవి బిజెపికి విడిచి పెట్టాలని ఆయన కోరారట. తెర వెనుక జరిగిన తత్తంగాన్ని ఆయన వివరించారట. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ ఒప్పుకున్నారట. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు ఇప్పుడు బిజెపికి వెళ్ళనుందట. అయితే బిజెపి మాత్రం చిరంజీవిని సంప్రదించిందట. కానీ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. రాజ్యసభ పదవిని సైతం తిరస్కరించినట్లు సమాచారం.

ఒకవేళ పదవి ఇవ్వాలనుకుంటే రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ పదవి ఇస్తే సరిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చిరంజీవి రాజ్యసభ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి ఎపిసోడ్ ముగిసినట్టే. ఇప్పుడు రాజ్యసభ పదవి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఖాయం అయినట్లు ప్రచారం నడుస్తోంది. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనతో ఎదురైన పరిణామాలతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అందుకే ఇప్పుడు రాజ్యసభలో అడుగు పెట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి. మరోవైపు ఈ రెండు కుటుంబాలకు చంద్రబాబుతో సైతం విభేదాలు కొనసాగేవి. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కిరణ్ సోదరుడు కిషోర్ టిడిపిలోకి వచ్చారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా మారారు. అటు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో సైతం చంద్రబాబు స్నేహం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయితే సరైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావించారు. అయితే కిరణ్ బిజెపి నుంచి బరిలో దిగడంతో ముస్లింల నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. అయితే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ బిజెపితో ఉన్న అనుబంధంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు రాజ్యసభకు దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!