Saturday, October 5, 2024

వరద సహాయ చర్యల్లో బీఆర్ఎస్ శ్రేణులు..అయినా కేసీఆర్ కనబడుట లేదంటూ ఫ్లెక్సీలు

- Advertisement -

గెలుపు అనేది బూస్టింగ్ ఇస్తుంది. ఓటమి అనేది తీవ్ర నైరాశ్యంలో నెట్టేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది బీఆర్ఎస్. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి చతికిల పడింది. అప్పటి నుంచి పరిస్థితి తీసికట్టుగా మారింది. తెలంగాణాను తొలి తొమ్మది ఏళ్ల పాలించిన పార్టీ అన్న విషయాన్ని మరిచిపోయారు. తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.. రెండోసారి సీఎం అయ్యారు కేసీఆర్. ముచ్చటగా హ్యాట్రిక్ కొడతానని భావించారు. కానీ ప్రజలు అలా భావించలేదు. అనూహ్యంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక చాన్స్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సైతం జైకొట్టారు. అనూహ్యంగా తొమ్మిదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ పార్టీని పక్కనపెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్ అండ్ కో ఇబ్బందులు పడుతునే ఉన్నారు. కానీ ప్రజాక్షేత్రాన్ని మాత్రం మరువలేదు. అసెంబ్లీ లోపలా, బయట తమవంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ తాజాగా హైదరాబాద్ నగరంలో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు.తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.

అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.అధికార పక్షంతో సమానంగా వరద సహాయ చర్యల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో హరీష్ రావు వాహనాలపై దాడి జరిగిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి.

భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్​ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్​రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన, బీఆర్​ఎస్​ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని హరీశ్ రావు తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చాయన్నారు.
తాను ఖమ్మం వెళ్లి వరద బాధితులను పరామర్శించానని హరీశ్​రావు తెలిపారు. వారిని చూస్తే తన కళ్లలో కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇదంతా కేసీఆర్ ఆదేశాలతోనే చేస్తున్నా ‘కేసీఆర్ కనబడుట లేదు’ అని ఫ్లెక్సీలు వెలియడంపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోలన చెందుతున్నాయి. టైమ్ అంటూ నిట్టూరుస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!