Sunday, January 26, 2025

Chandrababu-Jagan: జగన్ తీసుకొచ్చిన అతి గొప్ప పథకం రద్దు చేసిన చంద్రబాబు – రగిలిపోతున్న ఏపీ జనం!!!

- Advertisement -

Chandrababu-Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మరో ఓ వ్యవస్థను రద్దు చేసి పడేసింది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ౦ అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మార్చేసింది చంద్రబాబు- పవన్ సర్కార్. అమ్మ ఒడికి తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, నాడు-నేడుకు మన బడి- మన భవిష్యత్‌గా మార్చింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక భద్రత పింఛన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఈ జాబితాలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, వైఎస్సార్ విద్యోన్నతి, వైఎస్సార్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథక వంటివి కూడా ఉన్నాయి. వాటిల్లో పింఛన్లు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా ఇలా పథకాలన్నిటినీ తుంగలో తొక్కేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్షాల అభిప్రాయం.

తాజాగా జగన్ ప్రభుత్వం అమలు చేసిన మరో విధానాన్ని రద్దు చేసింది చంద్రబాబు- పవన్ కూటమి సర్కార్. అదే రివర్స్ టెండరింగ్ విధానం. వేల కోట్ల రూపాయలతో కార్యకలాపాలను నిర్వహించే జల వనరుల మంత్రిత్వ శాఖలో దుబారాను అరికట్టడానికి మరియు ఆర్థిక నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం ఇది. ఈ విధానాన్ని చంద్రబాబు- పవన్ ప్రభుత్వం రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్‌ను అమలు చేస్తూ 2019 ఆగస్టు 16వ తేదీన జారీ అయిన జీవో నంబర్ 67ను రద్దు చేసింది. దాని స్థానంలో పాత విధానం అంటే ఆన్‌లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను అనుసరిస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. రివర్స్ టెండరింగ్ వ్యవస్థకు సరితూగేలా ఇ- ప్రొక్యూర్‌మెంట్‌ను అమలు చేస్తామని వివరించింది. ఈ మేరకు జీవో నంబర్ 40ను జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్ విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్ గతంలో సిఫారసు చేసిందని దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నేరవేర్చకపోగా జగన్ హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేయడంతో ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!