YS JAGAN: ఓటమి మనిషికి పాఠం నేర్పితే గెలుపు మాత్రం మనిషికి లక్షణం నేర్పిస్తుంది అనేది ఒక సామెత. విధి రాతలో మనం ఏ పాత్ర పోషిస్తామో మనకి తెలియదు. కర్మ సిద్ధాంతాన్ని చేసే ప్రతి తప్పుకి వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే అనే విషయం చాలా మంది నమ్ముతారు. ఇదంతా ఒక బూటకమే అనే భ్రమలో బ్రతికే వారిని మనం ఏమీ చేయలేము. రాజకీయం అనేది చాలా కీలక పాత్ర పోషించే విషయం ఏ దేశం లో అయినా ఏ రాష్ట్రంలో అయినా. ప్రజల జీవన విధాన౦ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవడంలో రాజకీయ నాయకులదే కీలక పాత్ర అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పేదవాడిని ధనవంతుడిగా చేయాలన్నా ఒక ధనవంతుడిని మరింత కుబేరుడిలా చేయాలన్నా రాజకీయ నాయకులదే కీలక పాత్ర. అందరితో సమానంగా నిజాయితీతో కూడిన రాజకీయం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. అలా కాకుండా కేవలం అధికారం కోసం చేసే పనులు సొంత లాభం కోసం చేసే రాజకీయం కచ్చితంగా బెడిసి కొడతాయి. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఒక పక్క ప్రజలకి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకొని ప్రజలకి మంచి చేసుకుంటూ వారికి ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు.
మరొక పక్క ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం అధికారం కోసమే సాధ్యం కానీ హామీలని ప్రజలకి ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చే పరిస్థితి లేక అప్పుడే చేతులెత్తేశారు. గెలవడం కాదు ఏ స్థాయిలో మనం గెలిచాము ఎంత నిజాయితీగా ప్రజలకి మంచి జరిగే పనులు చేశాము అన్నదే ముఖ్యం. జగన్ అయిదేళ్ళ పాలన చూసిన ప్రజలు కచ్చితంగా ఆయన్ని మళ్ళీ గెలిపిస్తారనే అంతా అనుకున్నారు. కానీ ఎందుకు ఆ దేవుడు ఇంత మంచి చేసిన జగన్ కి ఇంత ఓటమి ఎదురయ్యే పరిస్థితి ఇచ్చాడో రాబోయే కాలమే సమాధానం చెప్పాలి. జగన్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ గా నిలబెట్టిన వైనం అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ అయ్యే విధానం దేశంలోనే మొదటి సారి ప్రవేశ పెట్టింది కూడా జగనే. ఒకరు మంచి చేస్తుంటే మరొకరు వచ్చి మరింత మంచి చేయాలి తప్ప ఉన్నది చెడగొట్టే ప్రయత్నం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏపీ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
విధి ఆడిన వింత నాటకంలో కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు మరియు పవన్ ప్రజలకి అనేక హామీల వర్షం కురిపిస్తూ అధికారంలోకి వచ్చారు. కానీ వారి అసలు ఉద్దేశం వేరే. కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు అధికారం కావాలని అనుకున్నారు. చంద్రబాబు మరియు పవన్ వైఖరి గమనిస్తుంటే కేవలం వారి స్వార్ధం కోసమే అధికారం చేపట్టినట్లు ఉంది తప్ప తమకు మేలు చేయడానికి కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. చూస్తుంటే చంద్రబాబు పవన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు తమకి మళ్ళీ జగన్ పాలన కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే జగన్ ఓడిపోలేదని జగన్ గెలిచినట్లే అని జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.