Monday, January 13, 2025

Ys Jagan: జగన్ కాపాడితే ..చంద్రబాబు నిండా ముంచేశారు. చేసింది కూడా జగన్ చెప్పులేకపోయారే..!

- Advertisement -

Ys Jagan: కూటమి అధికారంలోకి వస్తే విశాఖపట్నం ఉక్కు కర్మాగారంప్రైవేటీకరణ అవుతుందని జగన్ ఎన్నికల సమయంలో ఎంత చెప్పిన అక్కడి ప్రజలు పట్టించుకోలేద. కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారంప్రైవేటీకరణ అవుతుంటే జగన్ ఉంటే బాగుండేదని చర్చ అక్కడ ప్రజల్లో విపరీతంగా జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది.విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.

దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా లెక్క చేయడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. మోదీతో జగన్‌కు ఉన్న సఖ్యత, ఎంపీ విజయసాయి రెడ్డికు ఉన్న పరిచియాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని ప్రచారం కూడా చేసుకోలేకపోయింది వైసీపీ.

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తూ దూకుడు పెంచింది.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో శాశ్వత ప్రాతిపదికన పని చేస్తోన్న వారిలో వంద మందిని డెప్యుటేషన్ మీద పంపించనుంది కేంద్రం.

వారందరినీ కూడా నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సర్దుబాటు చేయనున్నారు.ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూత పడ్డాయి. బొగ్గు నిల్వలు అయిపోయాక కర్మాగారం మూసివేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగులకు పని ఏదీ లేకపోవడం వల్ల వారందరినీ కూడా ఇతర సంస్థల్లో సర్దుబాటు చేయనున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరినీ కూడా దశలవారీగా తొలగించే అవకాశం ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!