Saturday, April 19, 2025

Jagan-Tirumala: జగన్ తిరుమల మెట్లు ఎక్కుతున్న టైం లో ఇలా చేద్దాం అనుకున్నారు .. అతిపెద్ద కుట్ర భగ్నం!

- Advertisement -

Jagan-Tirumala: తిరుపతిలో వైఎస్‌ జగన్‌పై దాడికి కుట్ర! తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తిరుమల చేరుకోవాల్సి ఉండగా ఆయన రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్‌ జగన్‌పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్‌ చేసినట్టు సమాచారం. వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్తున్న సందర్భంగా ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్ని౦చి౦ది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరో వైపు నోటీసులు, హౌజ్‌ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలనూ పోలీసులు వేధింపులకు గురి చేశారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారిన నేపధ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తుంటే డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వాలని వైసీపీ నాయకులు ప్రశ్ని౦చారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తిరుపతి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో జగన్‌పై దాడి చేసేందుకు స్కెచ్‌ వేశారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా కుట్ర గురించి వివరాలను తెలిపింది.

తిరుపతి మరియు తిరుమలలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ విధింపుతో పాటు తిరుమల వెళ్లకుండా తమ పార్టీ నేతలకు నోటీసులు, హౌజ్‌ అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణకు దిగింది. తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. అంతేకాదు తిరుపతిలో జగన్‌పై దాడి చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ట్వీట్‌ చేసింది.

వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్‌ జగన్‌పై దాడికి బీజేపీ నేత భాను ప్రకాశ్‌ రెడ్డి, జనసేన నేత కిరణ్‌ రాయల్‌ అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి మరీ కావాలనే గూండాలను పురిగొల్పుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఈ మేరకు ఆరోపించింది. వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, జగన్‌ కాన్వాయ్‌పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులని పురమాయించినట్లు తెలిసి౦దని పేర్కొంది. జగన్ తిరుమల మెట్లు ఎక్కుతున్న సమయంలోనూ ఆయనపై దాడి చేసేందుకు సన్నాహాలు చేసినట్లు వారు ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనతో శ్రీవారి లడ్డూ విషయంలో తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా? అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!