Saturday, October 5, 2024

Ys Jagan:నందిగం సురేష్ కోసం జగన్ సంచలన నిర్ణయం – సుప్రీం కోర్టు కి జగన్?!

- Advertisement -

Ys Jagan: మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేసి ఏపీకి త‌ర‌లి౦చారు. ఆయన్ను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధ‌వారం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండ‌రాయుని పాలెంలోని ఆయ‌న నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై స‌మాచారంతో ఆయ‌న త‌న ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేప‌టి వ‌ర‌కు వేచి చూసి అక్క‌డి నుంచి వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా సురేశ్ బుధ‌వారం ఉద‌యం నుంచి ఎక్క‌డ ఉన్నారో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. దాంతో పోలీసులకు ఆయ‌న హైద‌రాబాద్ నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లిన ప్ర‌త్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపక్ష వైసీపీకి ఇవాళ రెండో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్టు అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్ తో పాటు పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వీరిని అరెస్టు చేసేందుకు 12 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు అయ్యాయి. దీంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో నందిగం సురేశ్ ను రాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చి ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. ఇవాళ అరెస్టు చేసిన లేళ్ల అప్పిరెడ్డిని సైతం మంగళగిరి పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరబోతున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ రాత్రికి వీరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే జరిగితే గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యంలో వీరిని ఎలాగైనా బయటకి తీసుకువచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది. సుప్రీమ్ కోర్ట్ లో మిగిలిన ఇద్దరికీ ముందస్తు బెయిల్ కోరే పరిస్థితి కనిపిస్తోంది. నందిగం సురేష్ ని మరియు లేళ్ల అప్పిరెడ్డిని కూడా బయటికి తీసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!