Thursday, December 12, 2024

Jagan: జగనా మజాకానా.. తిరుమలకు లైన్ క్లియర్

- Advertisement -

Jagan: తిరుమల లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటాగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు.

దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇటువంటి సమయంలో జగన్ చేసిన ప్రకటన చేశారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇవాళ సాయంత్రం తిరుమల చేరుకోనున్న జగన్.. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. అయితే లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ టూర్ ను అడ్డుకోవాలని కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు రెండు రోజులుగా వరుసగా పిలుపునిస్తున్నాయి. తిరుమల స్వామి వారి దర్శనం కోసం హిందూ మతంపై విశ్వాసం ఉందని జగన్ డిక్లరేషన్ ఇస్తేనే అనుమతిస్తామని అటు టీటీడీ చెప్తుండగా.. ఇటు కూటమి పార్టీల నేతలు కూడా డిక్లరేషన్ ఇవ్వకుంటే అడ్డుకుని తీరతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయినప్పటికీ జగన్ మొండిగా ముందుకు సాగుతున్నారు. తిరుమల శ్రీవారిని ఎట్టి పరిస్థితుల్లో దర్శించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన తిరుమలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నాయి. జగన్ తిరుమల టూర్ ను అడ్డుకోరాదని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. దానికి బదులు కేవలం జగన్ వచ్చే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని కూడా నిర్ణయించాయి. దీంతో జగన్ తిరుమల టూర్ కు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్లే భావిస్తున్నారు. జగన్ ను తిరుమలలో అడ్డుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హెచ్చరికలతోనే కూటమి పార్టీలు దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఓవైపు టీటీడీని స్వతంత్ర సంస్థగా చెప్పుకుంటూ మరోవైపు జగన్ ను అడ్డుకుంటే ప్రభుత్వమే రాజకీయ కక్షతో ఇదంతా చేయిస్తుందన్న సంకేతాలు వెళ్తాయని అధికార కూటమి భావించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ టూర్ ను అడ్డుకోవద్దని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి తిరుపతి లడ్డూ విషయంలో జగన్ పైచేయి సాధించినట్టు అయింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!