Saturday, October 5, 2024

Chandrababu: స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబు కి సరిగ్గా ఏడాది తరవాత భయంకరమైన బ్యాడ్ న్యూస్ !

- Advertisement -

Chandrababu: స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి సరిగ్గా ఏడాది అయిందని ఈరోజు బ్లాక్ డే అని ఐటీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక ఛానెల్ లో అయితే ఏకంగా అరెస్ట్ కి ఏడాది అని వేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉంటే చంద్రబాబు మరియు పవన్ కలిసే వారు కాదని కూటమి ఏర్పాటు అయ్యేది కాదని జగన్ కి ఇంత వ్యతిరేకత వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా. జగన్ మోహన్ రెడ్డిని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణల పైనే జగన్ మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. రాజకీయాలలో అవినీతి చేశారు అనడం మటన్ కొట్టు మస్తాన్ జంతువులని సంరక్షించడం గురించి మాట్లాడటం లాంటిదే. రాజకీయం అంటేనే అవినీతి అలాగే అవినీతి అంటేనే రాజకీయం అనేలాగా తయారైంది దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి. కానీ అత్యుత్సాహానికి పోయి విపరీతమైన స్కాములు చేసి లక్షల కోట్లు దోచేస్తామంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు?

అందరూ మర్చిపోయిన చంద్రబాబు అరెస్ట్ రోజుని కావాలనే వాళ్ళ కార్యకర్తలు ఎందుకు గుర్తు చేస్తున్నట్లు? ఆయన ఏమైనా ఒక గొప్ప పని చేశాడా ఆరోజు? ఆయన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏదైనా ఉపయోగం కలిగిందా ఆరోజు? మరి అలాంటప్పుడు ఎందుకని ఏడాది అయిందని యానివర్సరీ జరుపుకోవాలి? ఎందుకు బ్లాక్ డే అసలు? ఎవరికి బ్లాక్ డే? స్వాతంత్ర్య పోరాటం చేస్తూ ఏమైనా జైలుకు వెళ్ళాడా ఆయన? కాదు కదా. స్వాతంత్ర్య పోరాటంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే గా ప్రకటించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా భగత్ సింగ్ ఆయన ప్రాణాలను అరిపించిన రోజుని బ్లాక్ డే గా ప్రకటించారు. మరి అవినీతి ఆరోపణలతో స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజుని బ్లాక్ డే అని టీడీపీ ఎందుకు ప్రచారం చేసుకుంటోంది? ఆయన అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం ప్రజలకి కావాలనే టీడీపీ కార్యకర్తలు నాయకులు గుర్తు చేస్తున్నట్లు ఉంది. కేసులో ఆయన నిర్దోషి అని తేలలేదు కదా ఇంకా. ఆయన బెయిల్ మీదనే బయట తిరుగుతున్నారు. కళ్ళు కనిపించట్లేదని కంటికి ఆపరేషన్ చేపించుకోవాలని బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎన్నికల ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు కావాలని ఈ అరెస్ట్ విషయం తెర మీదకి రావడంతో ప్రజల్లో ఎక్కడ తనకు వ్యతిరేకత వస్తుందేమో అని మళ్ళీ ఆ కేసు గురించి ప్రజల్లో చర్చ మొదలవుతుంది అని చంద్రబాబు భయపడుతున్నాడట. ఒకవేళ అదే జరిగితే గనుక చంద్రబాబు నాయుడుకి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!