YS Jagan: టీఎస్పీఎస్పీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న చైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కొత్త కమిషన్ ఏర్పాటునకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో విద్యా కమీషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నియమించారు. ఆయన గత కొంత కాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో అణిచి వేతలకు గురైన ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. ఆకునూరి మురళి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకొంది. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ఏపీలో మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. పిల్లలకు ఇంగ్లీషు మీడియం అమలును ఆయన విజయవంతం చేయగలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు–మన బడి కార్యక్రమాన్నిఅమలు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సమయంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ లోపాలను ఎత్తి చూపారు.
ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని ప్రజలకు ఆకునూరి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో బ్యాక్ ఎండ్ గా ఉన్న ఆకునూరి మురళికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఇందులో భాగంగా అపారమైన అనుభవం, విద్యా రంగం పట్ల మక్కువ, నిరుద్యోగుల పట్ల కన్సర్న్ ఉన్న మురళికి విద్యా కమీషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మురళి నియమించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు యోగ్యుడైన మేధావికి పదవిని కట్టబెట్టినట్టు ఉంటుందని ప్రభుత్వం భావించింది. పైగా ఆకునూరి మురళి స్వస్థలం మంచిర్యాల జిల్లా కావడంతో స్థానికుడికే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పాలకమండలి కూర్పు సైతం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉంటుందనే వాదన నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఆకునూరి మురళికి ఏపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. అక్కడ జగన్ తనకు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు. జగన్ తన హయాంలో నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్య అందాలని విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన దూరదృష్టి కల నాయకుడని.. తను చాలా గ్రేట్ అంటూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన తన స్వరాష్ట్రానికి వస్తానంటే వద్దన్నారని తెలిపారు. కానీ తెలంగాణలో దొంగలు పడ్డారని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఇక్కడకు వచ్చానన్నారు. అప్పుడు జగన్ గారు ఇక్కడ ఇంకా బాగా చేద్దామని కోరారని కానీ ఇక్కడ జరుగుతున్న మోసాలను ఎక్స్ పోజ్ చేయాలని వచ్చానని ఆకునూరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని.. మా రాష్ట్రంలో బాగు చేసుకోవాలని ఇక్కడకు వచ్చానన్నారు. కేసీఆర్, జగన్ ఒకటే అని ప్రశ్నించగా.. అలా ప్రచారం జరిగిందని అందుకే తాను అక్కడి నుంచి వచ్చేశానని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశానని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం క్విడ్ ప్రో కింద తనకు విద్యా కమీషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనేది పూర్తి అవాస్తవం అన్నారు. ఏది ఏమైనా జగన్ సీఎంగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధిని ఇంతకు ముందు ప్రభుత్వాలేవీ చేపట్టలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో గతంలో ఎన్నడులేని విధంగా.. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. పిల్లలకు ఇచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడిచింది. జగనన్న విద్యా దీవెన కింద పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని.. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా జమ చేసింది. అలాగే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా.. ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించింది. జగనన్న
పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని జనవరి 9, 2020న ప్రారంభించారు.
జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న అర్హులైన, విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రతి ఏటా రూ. 15 వేలు జమ చేసింది. కోవిడ్ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో 2022 విద్యాసంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చారు. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్ కల్పించింది.
హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్ లాంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ అందించింది. పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యాకానుక రూపంలో 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యాకానుక’ ప్రత్యేక కిట్లు అందజేసింది. వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఆక్స్‌ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బూట్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందిస్తున్నారు. నాడు–నేడు పేరిట ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు జగనన్న విద్యా కానుక పేరిట ఏటా ప్రత్యేక కిట్లు విద్యార్థులకు అందిస్తున్నారు. బడి బాట పట్టిన పిల్లలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంతో పాటు రూ.1,650 విలువైన విద్యా సామగ్రిని ఉచితంగా అందించింది.