Sunday, January 25, 2026

YS Jagan: వైఎస్ జగన్ ముందున్న అతి పెద్ద సవాలు అదే

- Advertisement -

YS Jagan: 2024 ఎన్నికలు వైసీపీకి చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందు పెద్ద పనులే మిగిలి ఉన్నాయి. రాజకీయంగా వైసీపీని బలోపేతం చేసి మళ్లీ పుంజుకునేలా సరైన మార్గంలో పెట్టడం అనేది ప్రస్తుతం జగన్ ముందున్న అతి పెద్ద సవాలు. వై నాట్ 175 స్లోగన్‌తో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చిన వైసీపీ అన్ని చోట్లా అభ్యర్ధులను బరిలోకి దింపింది. ఆ లెక్కన 2024 ఎన్నికల్లో మొత్తం సీట్లకు పోటీ చేసింది ఒక్క వైసీపీ మాత్రమే. అయితే.. ఎన్నికల నాటకీయ పరిమాణాల అనంతరం ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన నేతలు ఉన్నారా అంటే లేదనే ఒప్పుకోవాలి. ఓటమి అనంతరం కొందరు నేతలు వలస బాట పట్టడం, టీడీపీ కూటమి అధికారంలో ఉండి వైసీపీని నీరుగార్చే ప్రయత్నాలు చేయడం, ఈవీఎంలలో అవకతవకలు లాంటి విశ్లేషణలను పరిశీలిస్తే.. వైసీపీ బలహీనపడిందని, ప్రస్తుతం పార్టీలో నాయకత్వ లోపం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే.. నియోజకవర్గాన్ని నడిపించే ముఖ్య నాయకులు లేరనేది ఒక కఠిన వాస్తవం.

అయితే వైఎస్ జగన్ ప్రస్తుతం జిల్లాల వారీగానే అధ్యక్షుల నియామకానికి చర్యలు చేపడుతుండగా.. ఇంకా అసెంబ్లీ ఇంచార్జిల వరకు రాలేదు. వారి విషయంలో అతి పెద్ద కసరత్తు చేయాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు.. ఐదేళ్ల పాటు పార్టీ అండతో పదవులు అనుభవించి, తీరా ఎన్నికల్లో ఓటమి తర్వాత చేతి చమురు వదిలించుకున్న రీతిలో వలసల పేరుతో కొందరు బడా నేతలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళకు మళ్లీ వైసీపీ ప్రయోగాలు చేపట్టాలని అనుకున్నా ముందుండి నడిపించేవారెవరు అన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. 2019లో అఖండ విజయంతో పార్టీని గెలిపించుకున్నప్పటికీ.. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ముఖ్య నేతలంతా సైలెంట్ అయ్యారు. వారిని మళ్లీ గాడిలో పెట్టి పార్టీని గట్టి ప్రతిపక్షంగా తీర్చిదిద్దడం వైసీపీ అధినాయకత్వానికి ఒక పరీక్షే. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!