Adhimulam -Chandrababu:టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఆ పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. లైంగిక ఆరోపణలు రావటంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తనను వేధించారంటూ కోనేటి ఆదిమూలం పైన ఒక మహిళ ఆధారాలను బయట పెట్టారు. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఈ అంశం పైన ప్రాధమిక సమాచారం సేకరించిన తరువాత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీలో పని చేసే మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనకు జరిగిన వేధింపుల పైన ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కోనేటి ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు వెల్లడించారు. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని వివరించారు. ఈ వ్యవహారం వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు.
పార్టీ కార్యక్రమాల్లో కోనేటి ఆదిమూలంతో తనకు పరిచయం ఏర్పడిందని ఆ మహిళ వెల్లడించారు. తనకు పదే పదే కాల్స్ చేస్తూ హోటల్ కు రావాలని చెప్పేవారని తెలిపారు. అక్కడ తనను బెదిరించి తనపై కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది.
లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది. ఇకపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో ఉండటానికి అర్హుడు కాడని తెలిపింది. కోనేటి ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని తెలిపింది. రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడని పేర్కొంది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తను తనతో ఉండాల్సిందేనని కోనేటి ఆదిమూలం ఎంతో మందిని టార్చర్ చేశాడని వెల్లడించింది. దీంతో కోనేటి ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పండ్ చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కోనేటి ఆదిమూలం మాత్రం పార్టీ నుంచి తనని సస్పెండ్ చేస్తే పార్టీకే నష్టం అని లోకల్ క్యాడర్ అంతా తనతోనే ఉంది కాబట్టి నాకేం నష్టం లేదు అనే వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.