Thursday, November 7, 2024

YS Jagan: ఇది కదరా బ్రేకింగ్ అంటే : జగన్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీ లోకి వెళ్ళిన వాళ్ళ బతుకు ఏమైందో చూడండి

- Advertisement -

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలని చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచన కొంత మేరకు ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకుంటూ వైసీపీకి షాకిచ్చారు. న్న పదవిని వదులుకుని కొత్త పదవి వస్తుందో రాదో తెలియకుండా రిస్క్ చేస్తూ కూడా వైసీపీ గోడ దూకి పోయారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం అదే బాటలో ఉన్నారనే సమాచారం. ప్రత్యర్థిని నిర్వీర్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో తన కొడుకు నారా లోకేష్ కి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తనని ముఖ్యమంత్రి చేయడం సులభం అవుతుందని చంద్రబాబు ఈ ఆలోచన చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ను౦చి ఇదే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులని బయటికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలోకి లేదా జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మరియు ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకొని మరీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాకపోతే వీరు పార్టీ మారిన తరువాత వారిని చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తమని అవమానిస్తున్నరంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచార౦. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమని బయటికి తీసుకురావాలనే ఉద్దేశం తోనే పార్టీలోకి ఆహ్వానించారు తప్ప పార్టీలో తమకి ఎలాంటి గౌరవం దక్కడం లేదని వారు వైకాపా నాయకుల దగ్గర వాపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా తమకి ఎలాంటి గౌరవం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారట. తమకు పార్టీలో చేరేముందు చెప్పినట్లు నామినేటెడ్ పదవులు కూడా ఇప్పుడు దక్కుతాయనే నమ్మకం లేదని వారు బాధ పడుతున్నారట.

మరికొందరు వైసీపీ నుంచి రాజీనామా చేశాక వారిని టీడీపీ లోకి చేర్చుకోకుండా హోల్డ్ చేసినట్లు సమాచారం. స్థానికంగా వ్యతిరేకత ఉందని కొంత కాలం పాటు వేచి చూడాలని అధిష్టానం వారితో చెప్పిందట. దీంతో వారు అటు ముందుకి వెళ్ళలేక మళ్ళీ తిరిగి వైసీపీ లోకి వచ్చే అవకాశం లేక మధ్యలోనే కొట్టుమిట్టాడుతున్నట్లు వైసీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. అటు పార్టీలో చేరిన వారి పరిస్థితి మాత్రమే కాకుండా ఇలా వీరి పరిస్థితి కూడా బాలేదని జగన్ కి వెన్నుపోటు పొడిచి వెళ్తే వారి పరిస్థితి ఇలాగే అవుతుందని కొందరు వైసీపీ సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!