Friday, March 29, 2024

ఆసీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్

- Advertisement -

టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. గత ఏడాది ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.89 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఫిన్ అలెన్ , డెవాన్‌ కాన్వే భారీ షాట్లతో రెచ్చిపోయారు. ఫిన్‌ అలెన్‌ 16 బంతుల్లో 42 పరుగులు సాధించగా.. డెవాన్‌ కాన్వే సైతం అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 23, గ్లెన్‌ ఫిలిప్స్‌ 12 పరుగులు సాధించాడు. చివర్లో నీషమ్‌ 13 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపించాడు.దీంతో 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్‌ 200 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు.

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ 5 రన్స్ కే ఔటయ్యాడు. తర్వాత అంచనాలు పెట్టుకున్న మార్ష్ , స్టోనిస్ , టీమ్ డేవిడ్ , మాథ్యూ వేడ్ విఫలమయ్యారు. కాసేపు మెరుపులు మెరిపించిన మాక్స్ వెల్ ను సోధి ఔట్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖాయమయింది. 89 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్కోర్ వంద అయినా అవుతుందా అనిపించింది. కమ్మిన్స్ 21 రన్స్ చేసి స్కోర్ 100 దాటించాడు. చివరికి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు 111 పరుగులకు తెర పడింది. కివీస్ బౌలర్లలో సౌతీ 3 , సాంటనర్ 3 , బౌల్ట్ 2 వికెట్లు తీశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!