Thursday, October 3, 2024

విండీస్ కోచ్ పదవికి సిమ్మన్స్ గుడ్ బై

- Advertisement -

రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ ఈ సారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అర్హత సాధించలేక పోయింది. ఇది ఆ దేశ ఫాన్స్ కే కాదు ఓవరాల్ గా క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించింది. టీ ట్వంటీ ఫార్మాట్ లో స్టార్ ప్లేయర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కరేబియన్ టీమ్ కనీసం క్వాలిఫై కూడా కాలేక పోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పరిణామాలతో విండీస్ జట్టులో ప్రక్షాళన మొదయింది. వరల్డ్ కప్ కు క్వాలిఫై కాలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన పదవికి రాజీనామా చేశాడు. . ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా దృవీకరించింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నాడు
వెస్టిండీస్‌ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదనీ, కొన్ని దేశాల కలయిక అని టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శన కరీబియన్‌ అభిమానులకు నిరాశ కలిగించిందన్నాడు.తాము ఈ టోర్నీలో స్థాయికి తగ్గట్టు రాణించలేదనీ, దీనికి కరీబియన్‌ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పాడు.ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాననీ, ఇది స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమనన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకునేలా ప్రయత్నిస్తాననీ సిమన్స్‌ పేర్కొన్నాడు. కాగా సిమ్మన్స్ కోచింగ్ లోనే వెస్టిండీస్ 2016 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!