Thursday, December 12, 2024

వార్మప్ అదుర్స్ ..ఆసీస్ పై భారత్ విజయం

- Advertisement -

ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాలను భారత్ విజయంతో ఆరంభించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి ఖాయం అనుకున్న ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్స్ లో మన బౌలర్లు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందించారు. బుమ్ర స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ చివరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
కే ఎల్ రాహుల్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ మెరుపుల‌తో ఏడు వికెట్ల న‌ష్టానికి 186 ర‌న్స్ చేసింది. కె.ఎల్ రాహుల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఎడాపెడా బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. 27 బాల్స్‌లోనే రాహుల్ హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. 33 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి . హార్దిక్ విఫ‌ల‌మ‌య్యారు.
రోహిత్ 15, విరాట్ 19 ప‌రుగులు చేయ‌గా హార్దిక్ రెండు ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం నిల‌క‌డ‌గా ఆడుతూ టీమ్ ఇండియా స్కోరును పెంచాడు. సూర్య కుమార్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో దినేష్ కార్తిక్ కూడా వేగంగా ఆడడంతో భారత్ భారీ టార్గెట్ ను.కంగారూల ముందు ఉంచగలిగింది. చేజింగ్ లో ఆసీస్ కు ఓపెనర్లు ఫించ్, మిచెల్ మార్ష్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. మార్ష్ 35 రన్స్ , స్మిత్ 11 పరుగులకు ఔట్ అయ్యారు. అయితే ఫించ్, మాక్స్ వెల్ ధాటిగా ఆడడంతో ఆసీస్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. చివరి అయిదు ఓవర్లలో చేయాల్సిన రన్స్ కూడా ఎక్కువ లేకపోవడంతో భారత్ ఓటమి ఖాయమని చాలా మంది భావించారు. ఈ దశలో భారత్ అద్భుతమయిన డెత్ బౌలింగ్ తో ఆకట్టుకుంది. వరుస వికెట్లు పడగొట్టి పై చేయి సాధించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన షమీ అదరగొట్టాడు. కేవలం 4 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు.దీంతో ఆస్ట్రేలియా విజయానికి 6 రన్స్ దూరంలో నిలిచి పోయింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!