Friday, April 19, 2024

పవన్‌కు పబ్లిసిటీ పిచ్చన్న చంద్రబాబు…?

- Advertisement -

విశాఖపట్నంలో ఉదృక్తి పరిస్థుతులు నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం, జనసేనకు మధ్య పెద్ద యుద్దమే సాగుతుంది.ఇరు పార్టీ సమావేశాలు ఒకేరోజు జరగడం ఈ పరిస్థుతులకు కారణం అని తెలుస్తుంది. మంత్రులు పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేయడం.. జనసేన కార్యకర్తలు..మంత్రులపై దాడికి దిగడంతో అక్కడ పరిస్థులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. మంత్రులు విడ‌ద‌ల ర‌జ‌నీ, రోజా, జోగి రమేశ్ త‌దిత‌ర వైసీపీ ముఖ్య నేత‌ల కార్ల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడిని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం కూడా జరిగింది. పవన్ కల్యాణ్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లను విడుదల చేయకపోతే…తానే పోలీస్ స్టేషన్‌కు వస్తానని హెచ్చరించ్చారు.

విశాఖ ఇష్య్వూలో అటు వైసీపీ, ఇటు జనసేన హైలైట్ కావడంతో.. టీడీపీ రేసులో బాగా వెనుకపడిపోయింది. దీంతో టీడీపీ నేతలు డైలామాలో పడినట్లుగా కనిపిస్తుంది. ఈ ఘటన పవన్ కల్యాణ్‌కు బాగా మైలేజ్ వస్తుందని..జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. దీనిపై పార్టీ అధినేతతో చర్చించగా.. పవన్ కల్యాణ్‌కు పబ్లిసిటీ పిచ్చి ఉందని.. వ్యాఖ్యనించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ , జనసేన కలిసి పోటీ చేయలని చూస్తున్న తరుణంలో చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేశారంటని టీడీపీ నాయకులు తెగ బాధపడుతున్నారట. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎల్లో మీడియా విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ ఇస్తోంది. పొత్తు విష‌య‌మై తేల‌కుండానే ప‌వ‌న్‌కు ప‌బ్లిసిటీ ఇవ్వ‌డం రాజ‌కీయంగా శ్రేయ‌స్క‌రం కాద‌ని టీడీపీ అనుకుల మీడియాకు చంద్ర‌బాబు ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయంగా లాభిస్తుంద‌ని, త‌మ‌కొచ్చే ప్ర‌యోజ‌నం ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీ కూడా పవన్‌కు ఉండటం.. చంద్రబాబును పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. అసలు పవన్ తమతో వస్తారా లేక బీజేపీతో నడుస్తారా అనే తెలియకుండా .. ఆయనకు మద్దుతగా నిలడటం కరెక్ట్ కాదని చంద్రబాబు వాదన. మరి దీనిపై టీడీపీ అధినేత ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!