టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ లో భారత్ ఓడిన తర్వాత సెమీస్ సమీకరణాలు మారిపోయాయి. టీమిండియా గెలిచి ఉంటే సెమీస్ కు మరింత చేరువయ్యేది. ఓడిపోవడంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిచి సెమీస్ లో అడుగుపెట్టాలని భావిస్తోంది. బుధవారం ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజుల నుంచి ఆడిలైడ్‌లో వర్షాలు కురుసున్నాయి.
వాతావరణం సరిగా లేకనే భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకోవాల్సీ వచ్చింది.
దీంతో రేపటి మ్యాచ్ పై అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఒకవేళ భారత్ , బంగ్లా మ్యాచ్ వర్షంతో రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్ ఐదు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఒక మ్యాచ్ లో జింబాబ్వేపై టీమిండియా ఖచ్చితంగా గెలిస్తే సెమీస్ చేరుకుంటుంది. ఒక వేళ పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు.అయితే భారత్ కు బంగ్లాదేశ్ నుంచీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధిస్తే భారత్ తో సమంగా ఉంటుంది. అప్పుడు రెండు జట్ల రన్ రేట్ కీలకం కానుంది.
అయితే బంగ్లా కంటే భారత్ రన్‌రేట్ మెరుగ్గా ఉందడంతో టెన్షన్ లేనట్టే. మరోవైపు జింబాబ్వేకు కూడా సెమీస్ ఛాన్స్ ఉంది. ఆ జట్టు పాకిస్తాన్, భారత్‌పై విజయం సాధిస్తే ఏడు పాయింట్లతో సెమీస్ లో అడుగు పెడుతోంది. ఇక ఐదు పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ , జింబాబ్వే లపై గెలిస్తే టీమిండియా ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అందుకే వర్షం భారత్ మ్యాచ్ లకు అడ్డు పడకూడదని ఫాన్స్ కోరుకుంటున్నారు