Thursday, November 7, 2024

ఆసక్తికరంగా మారిన సెమీస్ ఈక్వేషన్

- Advertisement -

వరుస రెండు విజయాలతో జోరు మీద కనిపించిన టీమిండియా సఫారీ జట్టు చేతిలో ఓటమితో అందరినీ నిరాశ పరిచింది. ఈ పరాజయంతో గ్రూప్ 2 లో సెమీస్ రేసు ఈక్వేషన్ మళ్లీ మారాయి. ప్రస్తుతం ఈ గ్రూప్ నుంచీ నెదర్లాండ్స్ మాత్రమే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత్ , పాక్ , సౌతాఫ్రికా , జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్ కూడా రేసులో ఉన్నాయి. దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌కు చేరుకుంది. ఇక భారత్ 2 విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది.

బంగ్లాదేశ్‌కు కూడా నాలుగు పాయింట్లతో ఉన్నా నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.
ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఒక మ్యాచ్‌లో గెలిచినా సెమీ ఫైనల్‌ ఛాన్స్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంపై ఆధారపడాల్సి ఉంటుంది. రోహిత్ సేన బంగ్లాదేశ్, జింబాబ్వేతో మిగిలిన రెండు మ్యాచ్ ల్లో తాలపడుతుంది.

మరోవైపు భారత్ ఓటమి తర్వాత పాక్ జట్టుకు సెమీస్ ఛాన్స్ క్లిష్టంగా మారినా టోర్నీ నుంచీ పూర్తిగా మాత్రం నిష్క్రమించ లేదు. దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే, బాబర్ సేన ఇంటి దారి పడుతుంది. దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ ఓడించినా.. నెదర్లాండ్స్‌తోనూ దక్షిణాఫ్రికా ఆడాల్సి ఉన్నందున అది కష్టమేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలిస్తే 7 పాయింట్లు దక్కుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఆరు పాయింట్లను మాత్రమే దక్కించుకుంటుంది. అప్పుడు భారత్ ఒక మ్యాచ్ లో ఓడితే..వారి కంటే మెరుగైన రన్ రేట్ పాక్ జట్టుకు ఉంటే సెమీస్ రేసులో నిలుస్తుంది. అటు జింబాబ్వే , బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితాలు కూడా పాక్ కు అనుకూలంగా రావాలి. మొత్తం మీద సెమీస్ రేసు మరింత ఆసక్తి కరంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!