Thursday, November 7, 2024

టీడీపీ-జనసేన పొత్తు ..సర్వే లెక్కలు ఇవే..!

- Advertisement -

ఏపీలో 2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మరొసారి అధికారంలో రావాలని అధికార వైసీపీ పార్టీ వ్యూహాలు పన్నుతుంటే.. మరొసారి జగన్ అధికారంలోకి వస్తే.. మనకు పుట్టగతులు ఉండవని ప్రధాన ప్రతిపక్షాలైనా టీడీపీ, జనసేన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే జగన్‌ను ఢీ కొట్టలేమని ఈ రెండు పార్టీలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ , జనసేన కలిసి పోటీ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చేశాయి. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు పలుమార్లు భేటీ అయ్యారు. పోటీపై స్పష్టత వచ్చినప్పటికి కూడా … సీట్ల పంపకంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది.

ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి ఎంతో కొంత నష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే అప్పుడు ఓట్ల చీలిక జరగదు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగిందనేది టీడీపీ, జనసేన పార్టీ నాయకుల వాదన. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదు అని చెప్పి చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. . ఇదిలా ఉంటే టీడీపీ-జనసేన పొత్తు ప్రభావంపై ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నారట. దాదాపు 120 స్థానాల వరకు పొత్తులో గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు లాంటి ఉమ్మడి జిల్లాల్లో పొత్తు ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. సీట్ల పంపకాలు తరువాత చాలా పరిణమాలు చోటు చేసుకుంటాయి. జనసేన కార్యకర్తలు సహకరించినంతగా .. టీడీపీ కార్యకర్తలు తమకు సహకరించరని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇరు పార్టీ నేతలు కూడా పొత్తుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి చివరికి పొత్తు ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!