Thursday, April 25, 2024

పాత మొగుడే కాని కాపురమే కొత్తది అంతే..!

- Advertisement -

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణమాలను చూస్తుంటే భవిష్యత్తులో పొత్తులకు తెర లేపినట్లుగా కనిపిస్తుంది. అసలు జరిగింది ఏమిటో కూడా మర్చిపోయి.. వారికి అనుకులంగా రాజకీయాలను సాగించడం ప్రతిపక్షాలకే చెల్లింది. మంత్రుల మీద దాడి చేయడం తప్పు కాదు.. దాడి చేసిన పిల్ల సైనికులు.. సారీ జనసైనికుల కార్యకర్తలను అరెస్ట్ చేయడం తప్పని వ్యాఖ్యనించడం నిజంగా ప్రతిపక్షాలకే చెల్లింది. ఇంతకి మనం దేని గురించి చర్చించుకుంటానామో అందరికి అర్థం అయ్యే ఉంటుంది కదా. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మరో అధ్యయానికి తెర లేపినట్లుగా తెలుస్తుంది. ముందుస్తుగానే ప్లాన్ చేసుకున్నట్లుగానే.. ఇద్దరు కూడా కలిసి నాటకాన్ని రక్తి కట్టించారు. పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను నా కొడుకులని సంభోందించడం ఏంటీ..ఆయనకు చంద్రబాబు సంఘీభావం తెలపడం ఏమిటో చూస్తుంటే.. ఇంతకన్నా విడ్డురం ఎక్కడ కూడా ఉండదు.

ఇక్కడ బాధితులు ఎవరో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మంత్రుల మీద దాడి చేసిన ఘటన గురించి స్పందించక పోవడం.. వెన్నుపోటు పోడిచిన చంద్రబాబుకే చెల్లింది. అయిన మన పిచ్చి కాకపోతే… చంద్రబాబు ఎప్పుడు నీతివంతమైన రాజకీయాలు చేశారులే కానివ్వండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే… ఒకే ఒక్కడును ఓడించడానికి రాజకీయ శక్తులన్ని కూడా ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన సీపీఐ .. భవిష్యత్తులో బీజేపీ.. ఇలా ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్ని కూడా .. జగన్‌ను ఓడించడానికి ఏకం అవుతున్నాయి. ఇందులో ఎటువంటి తప్పు కూడా లేదు. దానికి వీరు అనుసరిస్తున్న విధానమే ఎవరికి నచ్చడం లేదు. జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా .. ఆయన్ను ఎలా ఓడించాలి.. ఎలా కించపర్చాలనే దాని మీదనే ప్రతిపక్ష నాయకులు ఎక్కవుగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఆఖరిని సీఎం జగన్ ఇంటి ఆడవారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయించిన ఘనత ఖచ్చితంగా టీడీపీ అధినేతకే దక్కుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గొంతులో నుంచి మాటరాని పవన్ కల్యాణ్.. జగన్ సీఎం అవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగానే నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తిరిగి ప్రతివిమర్శలను మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

రాజకీయాలనే మార్చేస్తానని వచ్చిన.. పవన్ కల్యాణ్ తానే మారిపోయినట్లుగా కనిపిస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో ఒకలా.. వైసీపీ ప్రభుత్వంలో మరోలా వ్యవహరించడం పవన్ కల్యాణ్‌కే చెల్లింది. ఈ రోజు జరిగిందంతా కూడా గతంలో అందరు ఊహించిందే. వీరిద్దరు కలిసిపోతారనే విషయం ఏపీలో ఓటు రాని వ్యక్తి కూడా చెబుతున్నారంటే..వీరి బంధం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ , చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి తమకున్న ముసుగును తొలగించారు. భవిష్యత్తు గురించి ఆలోచించలేదని.. చెబుతునే జగన్‌ను ఓడిస్తామని చెబుతున్నారు. వీరిద్దరు వీడి వీడిగా వస్తే జగన్‌ను ఓడించలేరనే విషయం వారికి తెలుసు. అందుకే ముందుగా మనం కలిసి పోరాడదాం… తరువాత సీట్ల పంపకం గురించి మాట్లాడుకుందాం అనే భావనకు ఇద్దరు కూడా వచ్చినట్లు కనిపిస్తుంది. వీరి వైఖరిని చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖయం అయిపోయింది. పాత మొగుడే.. కాని కాపురమే కొత్తది. వీరిలో మొగుడు ఎవరో పెళ్లాం ఎవరో ఈపాటికి మీకు అర్థం అయి ఉంటుంది అనుకుంటా. మరి వీరిని జగన్ ఎలా నిలువరిస్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!