Friday, March 29, 2024

మొదటిసారి జగన్‌ గురించి నోరు విప్పిన కేవీపీ.. జగన్‌కు 40 శాతం కంటే ఎక్కువే ప్రజధారణ ఉందంటూ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

ఏ సర్వే చూసిన జగన్‌కు 40 శాతం కంటే ఎక్కువ ప్రజధారణ ఉంది.. మళ్లీ ఆయనే సీఎం – కేవీపీ

పవన కల్యాణే చెప్పారుగా జగన్‌కు 60 సీట్లు వస్తాయని.. దీనిని బట్టి మళ్లీ వైసీపీదే అధికారం – కేవీపీ

మాజీ రాజ్యసభ సభ్యుడు , కాంగ్రెస్ కీలక నేత అయిన కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి మారారు. రాజ్యసభ కాలం ముగియడంతో…కేవీపీ ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. ఇటీవల వరుసగా యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బీజీగా మారారాయన. గత ఇంటర్వూలో వైఎస్ ఫ్యామిలీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని.. అంత బాగానే ఉన్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ మీద కేసులు పెట్టిన సమయంలో తన ప్రమేయం ఏమి లేదని.. వైఎస్ తనయుడు మీద కేసులు పెడితే ఏపీలో కాంగ్రెస్ చాలా నష్ట పోతుందని హెచ్చరించనప్పటికి తన మాట ఎవరు వినలేదని చెప్పుకొచ్చారాయన.

ఇదే సమయంలో జగన్‌ను కూడా కాంగ్రెస్ పార్టీని వీడవద్దని వారించనని.. ఆయన కూడా తన మాట వినలేదని కేవీపీ వెల్లడించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు తాను చాలా బాధపడ్డానని.. అప్పుడు నేను నిసహాయతస్థితిలో ఉండిపోయానని కేవీపీ చెప్పుకొచ్చారు. తమ మధ్య వైఎస్ ఉన్నప్పుడు ఎలాంటి బంధం ఉందో.. ఇప్పటికి అలాంటి బంధమే ఉందని.. అది మీకు చూపించాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారాయన. తాజాగా మరో ఇంటర్య్వూలో జగన్ పాలనతో పాటు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీదో చెప్పే ప్రయత్నం చేశారు.

వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయని.. ఇది సాధ్యమయ్యే పనేనా అని కేవీపీని యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై ఆయన సమాధానం ఇస్తూ… రాజకీయాల్లో ఏది అయిన సాధ్యమే అని ఆయన వెల్లడించారు. కాని.. వారు ఓడించేంత బలహీనంగా అయితే జగన్ లేరని కేవీపీ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తాము చేసిన సర్వేలో వైసీపీకి 60 నుంచి 67 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని.. తెలిపారని దీనిపై మీరు ఏమాంటారని కేవీపీని ప్రశ్నించగా… పవన్ కల్యాణే చెప్పారు కదా.. 67 స్థానాల్లో జగన్ విజయం సాధిస్తారని.. ప్రత్యర్థి పార్టీ సర్వేలోనే అన్ని సీట్లు వస్తే..విజయం ఖచ్చితంగా జగన్‌దే అవుతుందని.. మరో 20 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చని కేవీపీ తన అభిప్రాయంను వెల్లడించారు.

ఇదే సమయంలో జగన్‌కు ఏ ప్రాంతంలో చూసుకున్న 40 శాతం ప్రజల ఆధారణ ఉందని.. ఆ ఓటు బ్యాంకు ఎటు పోదని.. మరో 4 నుంచి 5 శాతం ఓటు బ్యాంకు సాధిస్తే.. మరోసారి జగన్‌దే విజయం అని కేవీపీ చెప్పుకొచ్చారు. 33 శాతం ఓట్లతోనే బీజేపీ దేశంలో 340 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుందని…40 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ 175
సీట్లలో ఎందుకు గెలవకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ ధీమ వ్యక్తం చేయడంలో ఎటువంటి తప్పు లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. 4 నుంచి 5 శాతం ఓట్లు సాధించడం జగన్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చని తన అంచనాగా కేవీపీ తెలిపారు. ఇలా ఇంటర్య్వూ ఆసాంతం కూడా కేవీపీ జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!