Thursday, October 3, 2024

AP GOVERNMENT: అప్పుల ఊబిలో ఏపీ.. ఆదాయం అప్పులు కట్టడానికేనా?

- Advertisement -

AP GOVERNMENT : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇటీవల ఓ సందర్భంలో ఏపీ ఆదాయం అప్పులు కట్టడానికే అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉందా అంటూ పలువురు నెటిజన్లు సర్కారు అలసత్వంపై, పనితీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అనంతరం ప్రకటించిన పథకాలను శరవేగంగా అమలు చేయకపోవడానికి కూడా ఇదే అసలు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చంద్రబాబు చెప్పిన ప్రగల్భాలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల అమలు మినహా ఏపీలో అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించడం లేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అప్పులు విపరీతంగా పెరిగి ఊహించని స్థాయిలో ద్రవ్యోల్బణం దెబ్బతిందన్న మాట వాస్తవం. దానికి తోడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని నియత్రించాల్సింది పోయి సాధ్యం కాని హామీల అమలుతో ప్రజల ఓపికను పరీక్షిస్తున్నారు. ఏపీ ఆదాయం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని, ఇక అభివృద్ధి జరిగే పరిస్థితులే లేవని కూటమి కార్యాచరణల ద్వారా తెలుస్తోంది. ఏపీలో అప్పులు తగ్గితే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో అయినా ఏపీకి ఈ అప్పుల బాధ తగ్గుతుందేమో చూడాల్సి ఉంది. రాష్ట్ర అప్పులు తగ్గకపోతే ఏపీ అభివృద్ధి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!